KKR VS LSG : ఈ మ్యాచ్లో టాస్ గెలిచినప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడు తీసుకున్న నిర్ణయం తప్పని లక్నో బ్యాటర్లు నిరూపించారు. లక్నో ఓపెనర్లు మార్ష్(81), మార్క్రం(47) తొలి వికెట్ కు ఏకంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మరో ఆటగా నికోలస్ పూరన్(87*) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా లక్నో జట్టు మూడు వికెట్లు లాస్ అయ్యి 238 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో 87 పరుగులు చేసిన పూరన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో బంతుల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.. పూరన్ 1,198 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. కోల్ కతా ఆటగాళ్లు దూకుడుగా ఆడినప్పటికీ.. నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడినప్పటికీ.. లక్నో జట్టుపై పై చేయి సాధించలేకపోయింది.
Also Read : మొన్ననేమో సంతకం.. నేడేమో బంతి.. ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావ్?
కోల్ కతా నైట్ రైడర్స్ సరికొత్త రికార్డు
239 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అనితర సాధ్యమైన రికార్డు సృష్టించింది. ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ నమోదు చేసింది. 2017లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టుపై పవర్ ప్లే లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 105 పరుగులు చేసింది. నాటి మ్యాచ్లో సునీల్ నరైన్ 16 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టుపై కోల్ కతా పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 90 రన్స్ స్కోర్ చేసింది. (సునీల్ నరైన్ 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు.) విశాఖపట్నం వేదికగా 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులు చేసింది.(సునీల్ నరైన్ 21 బంతుల్లో 51* పరుగులు చేశాడు) 20 24 లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పవర్ ప్లే లో 85 పరుగులు చేసింది. ( సునీల్ నరైన్ 20 పంతులు 47 పరుగులు చేశాడు) గత సీజన్లో హైదరాబాద్ జట్టు పవర్ ప్లేయర్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 107 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ జట్టు నెలకొల్పిన రికార్డుకు రెండు పరుగుల దూరంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ నమోదు చేసింది.