Virat Kohli Six : టీ20 ప్రపంచకప్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ టీ20 షాట్ ఏంటి? మొత్తం ఎంతో మంది క్రీడాకారులు.. ఎన్నో షాట్లు కొట్టారు. కానీ ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఆడని ఆట.. ఎవ్వరూ కొట్టని షాట్ ను ఒకరు కొట్టారు. క్రికెట్ హిస్టరీలోనే అదో రికార్డ్. అది ఎవరో కాదు.. మన విరాట్ కోహ్లీనే.

పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రికార్డ్ ఛేదన చేసిన విరాట్ కోహ్లీ ఫైనల్ ఓవర్లలో పాక్ బౌలర్ అసద్ రౌవూఫ్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులలో ఒక సిక్స్ అద్భుతమని అప్పుడే అందరూ పొగిడారు. ఇప్పుడు ఐసీసీ కూడా దానికి గుర్తింపునిచ్చింది. గౌరవించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్ లోనూ భారీగా పరుగులు చేసి ఇండియా గెలుపులో కీలకంగా మారాడు. దీంతో ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎంపికయ్యాడు.
అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన బెస్ట్ షాట్ కేటగిరిలో మన విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హరీస్ రవూఫ్ బౌలింగ్ బౌలర్ తల మీద నుంచి బౌన్సర్ బాల్ ను సిక్సర్ గా మలిచిన షాట్ ను ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 షాట్ గా’ పేర్కొంది. ఇలాంటి షాట్ ఏ క్రీడాకారుడు కొట్టలేదని.. ఇంతటి అరుదైన ఘనతను మన విరాట్ కోహ్లీకి కట్టబెట్టింది. ఐసీసీనే ఈ అవార్డ్ ఇచ్చిందంటే మన కోహ్లీ ప్రతిభ విశ్వవ్యాప్తం అయినట్టే.
https://www.youtube.com/shorts/Rpq9jx_Wnco