Sunrisers Hyderabad Players: టీ20 వరల్డ్ కప్ సందడి ముగిసింది. క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ విషయంలో బిసిసిఐ కూడా అప్డేట్స్ మీద అప్డేట్స్ వదులుతోంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది.
ఐపీఎల్ లో సంచలన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad) ముందు వరుసలో ఉంటుంది. హైదరాబాద్ జట్టు ఈసారి ఏకంగా పదిమంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. హైదరాబాద్ జట్టులో హెడ్(Travis head), క్లాసెన్(henrich klassen), అభిషేక్ శర్మ(Abhishek Sharma) కీలకమైన ప్లేయర్లుగా ఉన్నారు. వీరు విధ్వంసకరమైన ఆటగాళ్లుగా పేరుపొందారు. హైదరాబాద్ జట్టులో హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ కాకుండా ఈసారి నలుగురు ప్లేయర్లపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
లివింగ్ స్టోన్
గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో లివింగ్ స్టోన్ ను కావ్య మారన్ కొనుగోలు చేసింది. ఇతడు మోస్ట్ డేంజరస్ ప్లేయర్. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఏడు లేదా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. విధ్వంసానికి పరాకాష్టగా పరుగులు తీస్తాడు.
సలీల్ అరోరా
డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీలు కొట్టాడు. ఇప్పటికే 350 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 190 పైన ఉంది. యావరేజ్ 71 గా ఉంది. ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల ఝార్ఖండ్ తో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు.
శివాన్ కుమార్
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇతడు. ప్లాట్ లో బంతులు వేస్తుంటాడు. గూగ్లీలు ఎక్కువగా సంధిస్తూ ఉంటాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగ్ లో మెరుపు విన్యాసాన్ని ప్రదర్శిస్తుంటాడు.
ప్రపుల్ ఇంగే
ఇతడు సౌరాష్ట్ర ఆటగాడు. 140+ వేగంతో బంతులు వేస్తాడు. ఇప్పటివరకు రంజి ట్రోఫీలో 15 వికెట్లు సాధించాడు. న్యూ బాల్ స్పెషలిస్ట్. ముఖ్యంగా పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో సత్తా చూపిస్తాడు.
ఈ నలుగురు అద్భుతమైన ఆటగాళ్లు. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు. మైదానంలో అత్యంత చు రుకుగా ఉంటారు. ఇటీవలి డొమెస్టిక్ క్రికెట్లో ఈ నలుగురు దుమ్మురేపారు. ఈ నలుగురిని కూడా హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఈసారి ఐపీఎల్లో ఈ నలుగురికి నేరుగా ప్రవేశం లభిస్తుందని.. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఒకవేళ ఈ నలుగురిని గనుక హైదరాబాద్ మేనేజ్మెంట్ తుది జట్టులోకి తీసుకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.