Homeక్రీడలుక్రికెట్‌Jos Buttler world record catch: బంతిని ఎవరైనా ఇలా క్యాచ్ పడతారా..బాబోయ్ నువ్వు తోపు...

Jos Buttler world record catch: బంతిని ఎవరైనా ఇలా క్యాచ్ పడతారా..బాబోయ్ నువ్వు తోపు క్రికెటర్ భయ్యో

Jos Buttler world record catch: క్రికెట్లో కొత్త కొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉంటాయి. పాత రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. క్రికెట్ ఒకప్పుడు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. చాలామంది క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నారు. కొంతమంది క్రికెట్ ను కెరియర్ లాగా ఎంచుకుంటున్నారు. క్రికెట్ ఆధారంగా వేలాది కోట్ల వ్యాపారం జరుగుతోంది.

ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలు చాలా ఉన్నప్పటికీ.. అందులో భారత దేశంలో క్రికెట్ ను చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బిసిసిఐ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా కొనసాగుతోంది. బీసీసీఐ ద్వారా సింహభాగం ఆదాయాన్ని ఐసిసి ఆర్జిస్తోంది. ఐసీసీ ద్వారా అనేక క్రికెట్ బోర్డులకు ఆదాయం లభిస్తోంది. అందులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు 50% దాకా వెళ్తోంది…

క్రికెట్లో ఎన్నో రికార్డులు నమోదు అవుతూనే ఉంటాయి. పాత రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. కొందరు బ్యాట్ ద్వారా.. ఇంకొందరు బంతి ద్వారా.. మరికొందరు ఫీల్డింగ్ ద్వారా.. మరికొందరు క్యాచ్ లు అందుకోవడం ద్వారా రికార్డులు సృష్టిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అత్యంత ఎత్తునుంచి వచ్చిన బంతిని అందుకొని ఓ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరూ సాధించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆటగాడు బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి వచ్చిన బంతిని అమాంతం అందుకున్నాడు. ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో ఓ మైదానంలో డ్రోన్ నుంచి బంతిని వదలగా.. దానిని బట్లర్ అందుకున్నాడు 122 మీటర్ల అంటే.. దాదాపు 40 అంతస్తుల భవనం అంత ఎత్తు అన్నమాట. అంత ఎత్తునుంచి డ్రోన్ ద్వారా బంతిని వదులగా.. దానిని బట్లర్ అందుకున్నాడు . తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు ఇంత ఎత్తులో నుంచి వచ్చిన బంతిని అందుకొని రికార్డు సాధించాడు.

“అంత ఎత్తునుంచి బంతి వస్తుంటే ఒక రకమైన ఉద్వేగంగా ఉంది. దానిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాను. బంతి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాను. అంత ఎత్తునుంచి బంతి వస్తుంటే సాధ్యమైనంతవరకు గమనం రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాని గమనాన్ని అంచనా వేసుకుంటూ.. అడుగులు ముందుకు వేసుకుంటూ… మెడ మీద.. కళ్ళ మీద ఒత్తిడి పడకుండా బంతిని అందుకున్నానని” బట్లర్ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version