Jofra Archer: ఇటీవల పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆర్చర్ అదరగొట్టాడు. అప్పటిదాకా పడుకున్న అతడు.. ఒక్కసారిగా లేచి వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.. పంజాబ్ జట్టు ఓటమిని శాసించాడు.
Also Read: సాయి సుదర్శన్.. టీమిండియాలో కచ్చితంగా సుదర్శన చక్రం తిప్పుతాడు..
అయితే మొదట్లో రెండు మ్యాచ్లలో తేలిపోయిన జోఫ్రా ఆర్చర్.. ఆ తర్వాత తన లయను అందుకున్నాడు. ఏమాత్రం బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం లేదు. పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు. పదునైన బంతులు వేస్తున్నాడు. ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం జోఫ్రా ఆర్చర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కట్టుదిట్టంగా బంతులు వేయడంలో.. వేగంగా బంతులు వేయడంలో.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బంతులు వేయడంలో ఆర్చర్ సిద్ధహస్తుడు. అందువల్లే అతని బౌలింగ్ లో ఆడాలంటే బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక బుధవారం నాడు గుజరాత్ జట్టు కెప్టెన్ గిల్ (2) ను జోప్రా ఆర్చర్ అవుట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అంతేకాదు మిగతా బౌలర్లు ఎలా బౌలింగ్ వేయాలో కూడా నిరూపించింది.
వికెట్ ఎగిరిపోయింది
గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ గా బరిలోకి వచ్చిన గిల్(2) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్ల బౌలింగ్ ను అంచనా వేయలేకపోయాడు. తన గురించి జీరో అంచనాలు ఉండడంతో గిల్ కు రెచ్చగొట్టే బంతులు కాకుండా.. చుక్కలు చూపించే బంతులు వేశాడు. అయితే ఆర్చర్ వేసిన ఒక బంతిని గిల్ ఆడలేకపోయాడు. అయితే ఆ తదుపరి బంతిని కూడా ఆర్చర్ మరింత స్వింగ్ జతచేసి వేశాడు. ఆ బంతిని సరిగ్గా ఊహించని గిల్ వదిలేశాడు.. కానీ ఆ బంతి వెంటనే వెనకాల ఉన్న వికెట్లను పడగొట్టింది. దీంతో గిల్ నిరాశతో మైదానాన్ని వీడాడు. గిల్ వికెట్ తీసిన నేపథ్యంలో ఆర్చర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు కురుస్తున్నాయి..” మొదట్లో రెండు మూడు మ్యాచ్లలో ఆర్చర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత తన అసలు సిసలైన ఆటతీరును చూపించడం మొదలు పెడుతున్నాడు. ఇటీవల పంజాబీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో గుజరాత్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్లో ఆర్చర్ అప్పటిదాకా స్టేడియంలో పడుకున్నాడు. కానీ ఎప్పుడైతే బంతిని పట్టుకుని మైదానం లోకి వచ్చాడో.. అప్పుడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా గిల్ వికెట్ తీసిన విధానం ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆర్చర్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక గిల్ అవుట్ కాకపోయి ఉండి ఉంటే గుజరాత్ మరింత భారీ స్కోర్ చేసేది. మొత్తంగా గుజరాత్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ ఆటగాడు గిల్ వికెట్ తీసిన నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
WHAT A PEACH FROM JOFRA ARCHER pic.twitter.com/O9ngJtKZ9h
— Johns. (@CricCrazyJohns) April 9, 2025