Ind Vs Eng 5th Test: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదో టెస్ట్‌లో కెప్టెన్‌గా మొదటిసారిగా భారత్‌కు కెప్టెన్ గా నాయకత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా తన మొట్టమొదటి టాస్‌కు హాజరైన వేదిక వద్ద కొంచెం ఇబ్బందికర ప్రశ్నను ఎదుర్కొన్నాడు. టాస్ సమయంలో మ్యాచ్ ప్రెజెంటర్‌గా వ్యవహరించిన ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్క్ బుట్చర్‌తో బుమ్రా స్వల్ప వాగ్వాదానికి దిగాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎడ్జ్‌బాస్టన్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లీష్ కెప్టెన్‌తో క్లుప్త సంభాషణ తర్వాత.. భారత కెప్టెన్ బుమ్రాను పిలిచి బుట్చర్ ఒక ఇబ్బందికర ప్రశ్నవేశాడు. మొదట టీమిండియాకు మొదటిసారి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు అభినందించాడు. అలాగే భారత్‌కు నాయకత్వం వహించే తొలి ఫాస్ట్ బౌలర్ బుమ్రానే కదా? అని ప్రశ్నించాడు. ఒక బౌలర్ కెప్టెన్ గా వ్యవహరించడం అరుదు కదా? అని బుమ్రాను అడిగేశాడు. దీనికి బుమ్రా అభ్యంతరం తెలిపాడు. క్లుప్తంగా బుట్చర్ మాటలకు కౌంటర్ ఇచ్చాడు. బౌలర్ అయిన కపిల్ దేవ్ ఇంతకు ముందు భారత కెప్టెన్ గా పని చేశాడని చెప్పాడు. అయితే బుట్చర్ కల్పించుకొని ‘అతను ఆల్ రౌండర్’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత బుట్చర్‌తో బుమ్రా ఏకీభవించినట్లు అనిపించినప్పటికీ వారి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
” తరుచుగా క్రికెట్ జట్లకు కెప్టెన్‌లుగా ఫాస్ట్ బౌలర్లు ఉండరు. కానీ భారత కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్లు ఇంతకు ముందెన్నడూ నియామకం కాలేదు” అని బుమ్రాను టాస్ వద్ద బుట్చర్ ప్రశ్నించాడు. దీనికి బుమ్రా బదులిచ్చాడు, “సరే, ఇంతకుముందు భారత క్రికెట్ లో ఒక బౌలర్ అయిన కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించాడని” వివరించాడు. అయితే కపిల్ దేవ్ ను “ఆల్ రౌండర్” అని బుట్చర్ కౌంటర్ ఇవ్వగా.. ఆ తర్వాత బుమ్రా కూడా “మీరు చెబితే సరే, ఆల్ రౌండర్” అని ఈ వాగ్వాదానికి ముగింపు పలికాడు.
1983 ప్రపంచ కప్‌లో మెన్ ఇన్ బ్లూని నడిపించిన కపిల్ దేవ్ ఇప్పటి వరకు భారతదేశపు అత్యుత్తమ ఆల్-రౌండర్‌లలో ఒకరిగా కీర్తించబడుతున్నాడు. ఈ వాదనలో బుమ్రా మరియు బుట్చెర్ ఇద్దరినీ తప్పుపట్టలేము. కానీ బుమ్రా టీమిండియాలో ఒక ఫాస్ట్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఆల్ రౌండర్ గా పూర్తి స్థాయిలో ఎదగలేదు.. ఫాస్ట్ బౌలర్ గానే కొనసాగుతున్నాడు.
ఇక ఇంగ్లండ్-ఇండియా మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి సెషన్ లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆధిపత్యం చెలాయించాడు. అతను భారత ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్.. ఛెతేశ్వర్ పుజారాలను చాలా ముందుగానే అవుట్ చేశాడు. కొద్దిసేపటికే వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో భారత్ ఇన్నింగ్స్ స్కోరు 53/2 వద్ద ఆకస్మికంగా నిలిచిపోయింది.
England have won the toss & elected to bowl. #ENGvIND pic.twitter.com/KYG4yBEeTG
— Doordarshan Sports (@ddsportschannel) July 1, 2022