Jasprit Bumrah: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు 20+ వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు..పెర్త్ టెస్టులో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.. అడిలైడ్, బ్రిస్ బేన్, మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లలో వికెట్ల మీద వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే కీలక సమయంలో టీమిండియా బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో వరుస ఓటములు తప్పలేదు. ఈ క్రమంలో బుమ్రా మరో అరుదైన రికార్డు ముందు ఉన్నాడు. ఇప్పటికే అతడు అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో చేరాడు. ఈ క్రమంలో ఈ స్పీడ్ గన్ మరో ఘనత ముందు కన్నేశాడు. సరిగ్గా 52 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో 35 వికెట్లను టీమిండియా బౌలర్ బిఎస్ చంద్రశేఖర్ పడగొట్టాడు.. అప్పటినుంచి ఇప్పటివరకు మరే టీమ్ ఇండియా బౌలర్ ఈ రికార్డు సృష్టించలేదు. అయితే ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా సిడ్ని టెస్టులో మరో ఆరు వికెట్లు తీయడం అంత కష్టం కాదు.. టీమిండియా విజయాలు సాధించలేకపోయినప్పటికీ.. బౌలింగ్ పరంగా బుమ్రా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. హెడ్ నుంచి మొదలు పెడితే లబూ షేన్ వరకు అవుట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు..
సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు
బుమ్రా.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తిరుగులేని స్థాయిలో బౌలింగ్ వేస్తున్నాడు. వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. బ్యాటర్ ఎవరనేది చూడటం లేదు. అద్భుతమైన బంతులు వేస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ” బుమ్రా అదరగొడుతున్నాడు. సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియా మైదానాలపై విశ్వరూపం చూపిస్తున్నాడు.
బుమ్రా కు తగ్గట్టుగా మరో బౌలర్ బౌలింగ్ కనక చేసి ఉంటే.. టీమిండియా పరిస్థితి మరో విధంగా ఉండేది.. కానీ ఇతర బౌలర్లు నిరాశ పరుస్తున్నారు. బుమ్రా లాగా బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు.. వారు వికెట్లు తీయలేక నిస్తేజంగా చూస్తున్నారు. అయితే బుమ్రా శుక్రవారం మొదలయ్యే సిడ్ని టెస్ట్ లోనూ ప్రతాపం చూపించే అవకాశం ఉంది. సిడ్నీ మైదానం కూడా పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది కాబట్టి.. కచ్చితంగా బుమ్రా వికెట్ల వేట కొనసాగిస్తాడని” క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ” ఇప్పటికే జరిగిన నాలుగు టెస్టులలో బుమ్రా పెను తుఫాన్ స్థాయిలో బౌలింగ్ చేశాడు. ఇకపై కూడా అదే స్థాయిని కొనసాగిస్తాడు. వికెట్ల మీద వికెట్లు పడగొడతాడు. అందులో అనుమానం లేదు. టీమ్ ఇండియాకు దొరికిన ఆణిముత్యం బుమ్రా.. అతడు శుక్రవారం సత్తా చాటితే మాత్రం టీమిండియాకు తిరుగుండదని” వారు వ్యాఖ్యానిస్తున్నారు.