https://oktelugu.com/

కోహ్లీని మించిపోయిన బుమ్రా

ఎలాంటి పెద్ద పెద్ద ఎక్స్‌పక్టేషన్స్‌ లేకుండానే 2020 ముగుస్తోంది. ఈ ఏడాది అందరినీ కరోనా ఆడేసుకుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో టీమిండియా కూడా పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం ఇండియా కెప్టెన్‌గా కోహ్లి ఉండగా.. ఇప్పటివరకు ఇండియా ఆడిన మ్యాచ్‌లోకెల్లా ఎక్కువ ఆర్జించింది మాత్రం పేసర్‌‌ జస్ప్రీత్‌ బుమ్రా అంట. Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్: పట్టుబిగించిన టీమిండియా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో కోహ్లీ, బుమ్రా, రోహిత్‌ శర్మ A+ కేటగిరీలో ఉన్నారు. ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 / 12:30 PM IST
    Follow us on


    ఎలాంటి పెద్ద పెద్ద ఎక్స్‌పక్టేషన్స్‌ లేకుండానే 2020 ముగుస్తోంది. ఈ ఏడాది అందరినీ కరోనా ఆడేసుకుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో టీమిండియా కూడా పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం ఇండియా కెప్టెన్‌గా కోహ్లి ఉండగా.. ఇప్పటివరకు ఇండియా ఆడిన మ్యాచ్‌లోకెల్లా ఎక్కువ ఆర్జించింది మాత్రం పేసర్‌‌ జస్ప్రీత్‌ బుమ్రా అంట.

    Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్: పట్టుబిగించిన టీమిండియా

    బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో కోహ్లీ, బుమ్రా, రోహిత్‌ శర్మ A+ కేటగిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. అది కాకుండా మ్యాచ్‌ ఫీజులు అదనం. ఒక్క టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు అయితే రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా 2020లో అందరికన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన బూమ్రా ఈ ఏడాది మ్యాచ్‌ ఫీజుల రూపంలో రూ.1.38 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

    Also Read: ఆ మాటలను ధోనీ నిజం చేశాడు

    కోహ్లీ ఒకే టెస్టుకు పరిమితం కావడంతో రూ.1.29 కోట్లు అందుకోనున్నాడు. మరోవైపు ‘ఏ’ కేటగిరీలోనే ఉన్న మరో ఆల్‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా ఈ ఏడాది మ్యాచ్‌ ఫీజుల రూపంలో తీసుకునేది రూ.96 లక్షలు. బుమ్రా, కోహ్లీ తర్వాత జడేజానే మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ మాత్రం ఈ ఏడాది గాయాల కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. దీంతో అతడి ఆదాయం కేవలం రూ.30 లక్షలు మాత్రమే.

    Tags