Homeక్రీడలుRavindra Jadeja: 11 సంవత్సరాలుగా ఉన్న ఇర్ఫాన్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా…

Ravindra Jadeja: 11 సంవత్సరాలుగా ఉన్న ఇర్ఫాన్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా…

Ravindra Jadeja: సెప్టెంబర్ 13 శ్రీలంక కొలంబోలో జరిగిన మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా…వన్డే ఫార్మేట్ లో ఇర్ఫాన్ పఠాన్ రికార్డును బ్రేక్ చేసి ఆసియా కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మంగళవారం సూపర్ ఫోర్ మ్యాచ్లో శ్రీలంకతో భారత్ జట్టు తలపడిన నేపథ్యంలో అతను ఈ రికార్డు సృష్టించాడు.

ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 18 ఇన్నింగ్స్ లో 24 వికెట్లు పడగొట్టి..12 ఇన్నింగ్స్ లో 22 వికెట్స్ తీసిన ఇర్ఫాన్ పఠాన్ స్కోర్ ను అధిగమించాడు. మరోపక్క కుల్దీప్ యాదవ్ కూడా 9 ఇన్నింగ్స్ లో 19 వికెట్లు తీసి తదుపరి ఈ రేస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

మొత్తానికి ఆసియా కప్ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జడేజా ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు ముత్తయ్య మురళీధరన్.. 24 ఇన్నింగ్స్ గాను 30 స్కాల్ప్లతో మొదటి స్థానంలో ఉన్నారు. మంగళవారం ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో ఆతిధ్య జట్టు భారత్ బౌలింగ్ దాటికి చేతులు ఎతేసింది.

భారత్ బౌలింగ్ దాటికి,172 పరుగుల స్వల్ప స్కోర్ కి లంక ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు శ్రీలంక ఇప్పటివరకు కొనసాగిస్తున్న 13 ఓడిఐ మ్యాచ్ల అజయ్ పరంపరను బ్రేక్ చేయడమే కాకుండా ఆసియా కప్ 2023 ఫైనల్ లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈసారి జరిగిన మ్యాచ్లో రెండు పక్షాల నుంచి స్పిన్నర్లే ఎక్కువగా ఆధిపత్యం చెలాయించారు.

భారత్ ప్రత్యర్థి శ్రీలంక జట్టుపై 40 ఒక పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో…రోహిత్ శర్మ 53 పరుగులు సాధించాడు.బౌలింగ్‌లో తన ప్రతిభ చూపించిన కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే మ్యాచ్‌లో 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న రవీంద్ర జడేజా…ఏళ్ల తరబడి ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న అరుదైన రికార్డు ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ సృష్టించాడు.

ఇర్ఫాన్ పటాన్ పేరిట ఉన్న ఈ రికార్డు ఈనాటిది కాదు…2012 నుంచి దుర్భై థ్వంగా ఉన్నటువంటి ఈ రికార్డును జడేజా సుమారు 11 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేశాడు. శ్రీలంక ప్లేయర్స్ ధనంజయ డి సిల్వా, దసున్ షనక వికెట్లను జడేజా తన ఖాతా లో వేసుకోవడంతో ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

ఇర్ఫాన్ 2004, 2008, 2012 సంవత్సరాలలో జరిగిన ఆసియా కప్ టోర్నీలలో భారత్ తరఫున మొత్తం 12 మ్యాచులు ఆడగా…22 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2012 తర్వాత ఇప్పుడు 2023లో జరిగిన ఆసియా కప్ టోర్నీలలో 18 మ్యాచ్లు ఆడిన జడేజా 24 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రస్తుతం భారత్ తరుపున ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జడేజా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

11 సంవత్సరాలుగా ఈ ప్లేస్ ని కంటిన్యూ చేస్తూ వచ్చిన ఇర్ఫాన్ ఇప్పుడు రెండవ స్థానంలోకి దిగాడు. టీమిండియా తరఫున ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఫైవ్ లిస్టులో జడేజా , ఇర్ఫాన్ తర్వాత
కుల్దీప్ (19), సచిన్ టెండూల్కర్ (17), కపిల్ దేవ్ (15) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular