Siraj: పట్టుదల ఉండాలే గానీ.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిడం ఎవరికైనా సాధ్యమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది అనేది ముఖ్యం కాదు.. ఎంతలా కష్టపడుతున్నామనేదే ముఖ్యం. ఇలా చిన్న స్థాయినుంచి స్టార్ గా ఎదగడం క్రికెట్ లో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఎదిగిన వారిలో మన హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. అయితే తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఆయన చెప్పుకుని బాధ పడ్డాడు.
మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనతో అందరికీ పరిచయం అయిపోయాడు. ఆ పర్యటనలో అతను సాధించిన విజయం అంతా ఇంతా కాదు. కాగా అతని విక్టరీతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. దీంతో అతని విజయం మీద సోనీ నెట్‌వర్క్ DownUnderdogs పేరు మీద సిరాజ్‌తో ఓ డాక్యుమెంటరీని తయారు చేస్తోంది.
Also Read: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?
ఇందులో అతని గురించిన విషయాలను ఎపిసోడ్స్ గా తీస్తోంది. కాగా సోమవారం వచ్చిన ఎపిసోడ్‌లో సిరాజ్ తనకు ఎదురైన ఓ చేదు ఘటన గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తాను 2018లో దారుణమైన ట్రోలింగ్ కు గురైనట్టు చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో ఎందరో తనను ఘోరంగా అవమానించారంటూ చెప్పుకొచ్చారు. చాలామంది తనకు క్రికెట్ వద్దని, తండ్రి లాగా ఆటో నడుపుకోవాలంటూ సూచించారని చెప్పుకుని బాధ పడ్డాడు. ఆ విమర్శలే తనకు పట్టుదల పెంచాయని, అందుకే టీమిండియా తరఫున అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలని డిసైడ్ అయినట్టు వెల్లడించారు. తన కల గబ్బా వేదికగా తీరిందని, ఇప్పుడు అందరూ తనను మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చాడు సిరాజ్. 2017లో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు.
Also Read: ప్రభుత్వం తమను మోసం చేసిందంటున్న ఏపీ ఉద్యోగులు.. జీవోలపై నిరసన