https://oktelugu.com/

Andy Roberts: అదృష్టం వల్లే భారత్ ఆ వన్డే వరల్డ్ కప్ గెలిచింది..!

భారత జట్టు వరల్డ్ కప్ గెలిచి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నాటి మధురస్మృతులను భారత క్రికెట్ అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. వరల్డ్ కప్ విజయం సాధించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొద్ది రోజుల కిందటే కపిల్ దేవ్ నేతృత్వంలో నాటి జట్టులోని ఆటగాళ్లు కలిశారు.

Written By:
  • BS
  • , Updated On : July 7, 2023 / 11:36 AM IST

    Andy Roberts

    Follow us on

    Andy Roberts: ఇండియా 1983లో అత్యంత పటిష్టమైన వెస్టిండీస్ పై వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి ఐసీసీ ట్రోఫీ అందుకుంది. ఈ విజయంతో భారత జట్టు అగ్రశ్రేణి జట్ల జాబితాలో చేరింది. అయితే ఈ విజయం భారత జట్టుకు అద్వితీయమైన పోరాట ఫలితంగా వచ్చింది కాదని, అదృష్టం వల్లే భారత్ వరల్డ్ కప్ గెలిచిందంటూ వెండిస్ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

    భారత జట్టు వరల్డ్ కప్ గెలిచి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నాటి మధురస్మృతులను భారత క్రికెట్ అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. వరల్డ్ కప్ విజయం సాధించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొద్ది రోజుల కిందటే కపిల్ దేవ్ నేతృత్వంలో నాటి జట్టులోని ఆటగాళ్లు కలిశారు. భారత జట్టు నాటి వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు, జట్టును ముందుండి నడిపించిన కపిల్ దేవ్ పాత్రను కొనియాడుతూ ఈ మధ్యకాలంలో మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ జట్టు మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ మాట్లాడుతూ.. జట్టుకు ఫైనల్లో విజయం అదృష్టం వల్లే దక్కింది అంటూ ఒక రకమైన ఆవేదన పూరితమైన వ్యాఖ్యలు చేశాడు.

    ఆండీ రాబర్ట్స్ ఏమన్నాడంటే..

    1983లో భారత జట్టు అత్యంత ప్రతిష్టమైన వెస్టిండీస్ జట్టుపై వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. వెస్టిండీస్ బౌలర్ల ధాటిని తట్టుకోలేక నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. 60 ఓవర్ల మ్యాచ్ లో 52 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 183 పరుగులకు కుప్ప కూలింది. భారత జట్టులో శ్రీకాంత్ 38 పరుగులు, అమర్నాథ్ 26 పరుగులు, సందీప్ పాటిల్ 27 పరుగులు, కపిల్ దేవ్ 15 పరుగులు, మదన్లాల్ 17 పరుగులు చేయడంతో భారత జట్టు 183 పరుగులు ఆల్ ఔట్ అయింది. అయితే, అప్పటికే అరవీర భయంకరమైన టీముగా పేరుగాంచిన వెస్టిండీస్ జట్టుకు ఈ లక్ష్యం చాలా చిన్నది. వెస్టిండీస్ జట్టు సులభంగానే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా భారత బౌలర్లు విజృంభించడంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా చేదించలేక వెస్టిండీస్ జట్టు చేతులెత్తేసింది. 52 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి 140 పరుగులు మాత్రమే చేసిన వెస్టిండీస్ జట్టు ఆల్ అవుట్ అయింది. 43 పరుగులు తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది.

    వెస్టిండీస్ జట్టులో రిచర్డ్స్ 33 పరుగులు, జఫ్ డుజాన్ 25 పరుగులు, మార్షల్ 18 పరుగులు మాత్రమే చేశారు. భారత జట్టు బౌలర్లలో అమర్నాథ్ మూడు, మదన్లాల్ మూడు, బల్విందర్ సందు రెండు వికెట్లు తీయడంతో వెస్టిండీస్ జట్టు దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే, భారత జట్టు అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో 1983 వరల్డ్ కప్పులో విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు మాజీ ఆటగాడు ఆండీ రాబర్ట్స్ మాత్రం భారత జట్టు విజయాన్ని చులకన చేస్తూ మాట్లాడాడు. నాటి వెస్టిండీస్ జట్టులో సభ్యుడుగా ఉన్న రాబర్ట్సు.. భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో అదృష్టం వల్లే గెలిచిందని, 1983లో తాము రెండు మ్యాచ్ ల్లో మాత్రమే భారత్ చేతిలో ఓడిపోయామని, ఆరు నెలల తర్వాత 6-0 తేడాతో ఓడించామని, వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను అదృష్టం వరించిందని, రిచర్డ్స్ అవుటయ్యాక తాము పుంజుకోలేకపోయాము అంటూ నిట్టూర్చాడు. అయితే, రాబర్ట్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.