Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan SRH Captain: కావ్య డిసైడ్.. కమిన్స్ కాదు.. తదుపరి మ్యాచ్ లకూ SRH...

Ishan Kishan SRH Captain: కావ్య డిసైడ్.. కమిన్స్ కాదు.. తదుపరి మ్యాచ్ లకూ SRH కెప్టెన్ అతడే.

Ishan Kishan SRH Captain: ఒక్కహాఫ్ సెంచరీ.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ అతడి జీవితాన్ని మార్చేయబోతోందా? అతడు తాత్కాలికం నుంచి శాశ్వతం స్థానానికి ప్రమోట్ కాబోతున్నాడా..సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని చిన్నస్వామి స్టేడియం నుంచే డిసైడ్ అయిందా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం లభిస్తోంది.

Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..

చిన్న స్వామి స్టేడియంలో శనివారం బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. హెడ్(11), అభిషేక్ శర్మ(7) దారుణంగా విఫలమయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి(1) కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈదశలో వచ్చిన ఇషాన్ కిషన్ షాన్ దార్ బ్యాటింగ్ చేశాడు. 38బంతులో 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో సాల్ట్ పట్టిన క్యాచ్ తో ఔట్ అయ్యాడు. క్లాసెన్(31)షెపర్డ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ చేరుకున్నాడు.

ఇషాన్ కిషన్ చేసిన 80 పరుగులు సన్ రైజర్స్ జట్టుకు జవసత్వాన్ని అందించాయి. కుప్ప కూలేస్థాయి నుంచి గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కు హైదరాబాద్ జట్టు చేరుకుంది. సమయోచితంగా బ్యాటింగ్ చేయడమే కాదు.. క్లాసెన్ తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇషాన్ కిషన్.

డొమెస్టిక్ క్రికెట్ లో ఝార్ఖండ్ జట్టును గెలపించాడు. ఫైనల్ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజేతగా నిలవడంలో అద్భుతమైన పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ ఆ స్థాయిలో తెగువ చూపించాడు కాబట్టి కావ్యమారన్ అతడి మీద నమ్మకం పెట్టుకుంది. కమిన్స్ గాయపడిన నేపథ్యంలో ఇషాన్ కిషన్ మీద నమ్మకం ఉంచింది. కావ్య పెంచుకున్న నమ్మకాన్ని కిషన్ వమ్ము చేయలేదు. ఫలితంగా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ దిశగా అడుగులు వేసింది. ప్రారంభం లో మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 170కి మించి పరుగులు చేసిందంటే దానికి కారణం ఇషాన్ కిషన్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version