Homeక్రీడలుIshan Kishan- Sanju Samson: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్.. వరల్డ్ కప్ లో ఎవరు...

Ishan Kishan- Sanju Samson: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్.. వరల్డ్ కప్ లో ఎవరు బెటర్

Ishan Kishan- Sanju Samson: ఈ సంవత్సరం చివరిలో భారత్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా ఆడుతున్న ప్రతి మ్యాచ్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రతి ప్లేయర్ సత్తా ఎటువంటిది ?ఎలా ఆడుతున్నారు ?నిలకడగా ఉన్నారా లేదా ?అన్న విషయాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ విడుదల చేసిన వన్డే వరల్డ్ కప్ ఆటగాళ్ల జాబితా కొత్త చర్చలకు తెరలేపింది.

20 మంది ఆటగాళ్లు ఉన్న ఈ జాబితాలో ముఖ్యంగా ఇద్దరి పేర్లపై కంపారిజన్ ఎక్కువగా జరుగుతుంది. ఆ ఇద్దరు ప్లేయర్స్ మరి ఎవరో కాదు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్. ఎవరి ఫీల్డ్ లో వాళ్లు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ గత కొద్ది కాలంగా వాళ్ల పర్ఫామెన్స్ లో కొన్ని హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఛాన్స్ దొరికినప్పటికీ సంజూ దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకో లేకపోయాడు. మరోపక్క ఇషాన్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఇప్పటికి 14 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచులలో ఆడి సగటు 42.50 తో 510 పరుగులు సాధించాడు ఇషాన్. అయితే మరోపక్క సంజూ కేవలం 10 ఇన్నింగ్స్‌లలో 66 సగటుతో330 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ విషయంలో ఇషాన్ కంటే సంజూ ముందంజలో ఉన్నాడు. ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే ఇద్దరు సమజీలనే చెప్పవచ్చు. ఇక వికెట్ కీపర్స్ గా కూడా ఇద్దరూ బాగా రాణిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ మ్యాచ్ ఎలా ఆడుతారు అనేది నిర్దేశించడానికి కొలమానంగా పరిగణిస్తున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో వీరిద్దరి మధ్య కాస్త వ్యత్యాసం ఉందనే చెప్పవచ్చు.

ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ రిలాక్స్ అయినప్పుడు సంజూ కు చాలా కాలం తర్వాత వన్డేలో ఆడే మంచి అవకాశం వచ్చింది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో అతను విఫలమయ్యాడు. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్ గా కిషన్ తన ప్రతిభను కనబరిచాడు. తొలి టెస్ట్ లో పూర్తిస్థాయి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా రెండవ టెస్టులో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే జోరుతో వన్డే సిరీస్ లో కూడా చెలరేగి ఆడిన అతను హ్యాట్రిక్ ఆఫ్ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

మిడిల్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసిన రెండవ వన్డేలో ఇషాన్ 55 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నిర్ణయాత్మకమైన మూడవ వన్డేలో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి 64 బంతులలో 77 పరుగులు సాధించాడు. మరోపక్క రెండవ వన్డేలో పేలవమైన పర్ఫామెన్స్ కనబరిచిన సంజూ శాంసన్ కూడా మూడవ వన్డేలో చెలరేగి ఆడి 51 పరుగులను సాధించి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మునుపుటి రికార్డుల సంగతి తెలియదు కానీ ప్రస్తుతం సంజూ తో పోలిస్తే నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ఇషాన్ జట్టుకు బలాన్ని చేకూరుస్తాడు అని అనిపిస్తోంది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular