Ishan Kishan: టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో రెండో వన్డే ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ 26 పరుగులు చేసినప్పటికీ.. తన సహజమైన ఆటతీరు చూపించలేకపోయాడు. 47 బంతుల్లో ఒక ఫోర్.. ఒక సిక్సర్ మాత్రమే కొట్టాడు. కెప్టెన్ గిల్ 31 పరుగులు చేశాడు. కిషన్ కేవలం వన్ రన్ మాత్రమే స్కోర్ చేశాడు. అదికూడా 8 బంతులు ఎదుర్కొని.
2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇంగ్లాండ్ టూర్ లో ఆడే జట్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. అయితే మేనేజ్మెంట్ ఆలోచనకు తగ్గట్టుగా కిషన్ ఆడటం లేదని తెలుస్తోంది. ఇటీవల టీ20 సిరీస్లో అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాడు. తొలి వన్డేలో విఫలమైన కేఎల్ రాహుల్ స్థానంలో అతడికి మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. కానీ అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.
8 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక్కపరుగు మాత్రమే చేశాడు. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ఇప్పటికే సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. అతడు ఇలా ఆడటం సెలెక్టర్లకు ఏమాత్రం రుచించడం లేదు. కేఎల్ రాహుల్ విఫలమైన చోట.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అతడు చేతులెత్తేశాడు. బాల్స్ ను ఫేజ్ చేయడంలో ప్లాఫ్ అయ్యాడు.
ఇలాగే అతడు తన ఆటతీరు కొనసాగిస్తే ఈసారి కూడా బ్యాగు సర్దుకుని వెళ్లిపోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఆట కొనసాగించి అతడు మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించడంతో మళ్ళీ అతడి పునరాగమనం కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే దారిలో అతడు సాగితే మాత్రం.. ఈసారి తిరిగి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మేనేజ్మెంట్ చాలా కఠినంగా ఉంది. 2027లో జరిగే వరల్డ్ కప్ ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని బలంగా భావిస్తోంది. అలాంటప్పుడు కిషన్ లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చి ఇండియా ఇబ్బంది పడలేదు. అటు రాహుల్, ఇటు కిషన్ విఫలం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మూడో వన్డేలో కొత్త ఆటగాడికి ఆ స్థానంలో ఆడించే అవకాశాలు లేకపోలేదు.
