Ishan Kishan Hyderabad IPL Captain: ఐపీఎల్ లో ఊహించని విధంగా హైదరాబాద్ జట్టుకు సారధిగా వ్యవహరించే అవకాశం ఇషాన్ కిషన్ కు లభించింది. గత కెప్టెన్ కమిన్స్ గాయం నుంచి కోలు కోకపోవడంతో.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ కు మేనేజ్మెంట్ సారధ్య బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే కావ్య కిషన్ మీద నమ్మకం ఉంచింది. ఇదే సమయంలో అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.
బీభత్సమైన ఫామ్
ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది ఐపీఎల్ తో పోల్చి చూస్తే.. ఇప్పుడు భీకరమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు. టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
గత ఏడాది ఐపీఎల్లో..
గత ఏడాది ఐపిఎల్ లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. 11.25 కోట్లతో హైదరాబాద్ యాజమాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో.. తొలి మ్యాచ్లో 47 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇషాన్ కిషన్ అదరగొట్టలేకపోయాడు. డొమెస్టిక్ క్రికెట్లో జార్ఖండ్ జట్టు సారధిగా అతడు సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. జార్ఖండ్ జట్టుకు తొలిసారిగా ట్రోఫీ అందించాడు. బ్యాటర్.. సారధి.. ఇలా అన్ని పాత్రల్లో అతడు ఆకట్టుకున్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్.. టి20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ సంచలన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఎంత ఒత్తిడి ఉంటుంది. అంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. తొలిసారిగా సారధ్య బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. ప్రారంభ మ్యాచ్ ల తర్వాత కమిన్స్ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ఒకవేళ అతడు రాకపోతే ఇషాన్ కిషన్ సారద్య బాధ్యతలను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ జట్టు గత ఏడాది దూకుడుగా ఆడింది. అయితే అది ఆ జట్టుకు అంత గొప్ప ఫలితాలను ఇవ్వలేదు. అయితే ఈసారి ఏమైనా మార్పులు చేస్తుందా? విలక్షణమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
హైదరాబాద్ జట్టు సారధిగా కమిన్స్ అద్భుతంగా ముందుండి నడిపించాడు. అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేస్తాడా? చూడాల్సి ఉంది. అతని మాదిరిగా కిషన్ జట్టులో స్ఫూర్తి నింపితే.. ఎటువంటి ఇబ్బంది ఉండదు.
పొట్టి ఫార్మాట్లో ఇషాన్ కిషన్ అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. ఇప్పటివరకు 29 మ్యాచ్లో అతడు సారధిగా వ్యవహరించాడు. 24 మ్యాచ్లలో జట్టుకు విజయాలు అందించాడు. గత ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఝార్ఖండ్ జట్టు 11 మ్యాచులు ఆడింది. కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడిపోయింది. సారధిగా ఉన్నప్పటికీ కిషన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. 29 మ్యాచ్లలో 1079 పరుగులు చేశాడు. సారధిగా ఉన్నప్పుడు అతడు టి20 లలో ఏడు సెంచరీలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో ఏకంగా శతకం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే అతడు సెంచరీ చేయడం విశేషం. ఇక టి20 వరల్డ్ కప్ లో 200 స్ట్రైక్ రేట్ తో తొమ్మిది మ్యాచ్లలో 317 రన్స్ కొట్టేశాడు.
