IPL 2022- Mukesh Choudhary: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఓటమి అంచుల నడుమ ఉన్న జట్టు అనూహ్యంగా విజయం సాధించవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ లో ఇలాంటి అనూహ్య ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. చాంపియన్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇప్పుడు అట్టడుగున ఉన్న సంగతి తెలిసిందే. అయితే చావో రేవో తేలాల్సిన నిన్నటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి.
హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికంటా పోరాడి చెన్నై గెలిచింది. అయితే చెన్నై గెలుపుతో ధోనీ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్ తో దుమ్ములేపి మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై 156 పరుగులు చేసింది. చివరి బాల్ వరకు పోరాడి చెన్నై ఆ లక్ష్యాన్ని చేధించింది.
Also Read: Bommala Koluvu: రివ్యూ : – ‘బొమ్మలకొలువు’
అయితే చెన్నై తరఫున ధోనీతో పాటు మరో యువ బౌలర్ గెలపులో కీలకంగా వ్యవహరించాడు. ఆయనే ముఖేశ్ చౌదరి. ఆయన పదునైన బౌలింగ్ ముందు ముంబై ఇండియన్ బ్యాటర్లు తడబడిపోయారు. అత్యంత వేగంగా యార్కర్లు వేస్తూ ముంబై బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లు వేసిన ముఖేశ్ 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే అతను వేసిన ఓ యార్కర్ ను ఎదుర్కోలేక స్టార్ బ్యాట్స్ మెన్ ఏకంగా కింద పడిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన మొదటి ఓవర్ రెండో బాల్‌కే రోహిత్‌ను పంపించేశాడు. ఆ తర్వత బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్‌కు 139 కిలోమీటర్ల వేగం యార్కర్ వేయగా.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చివరకు కింద పడిపోయాడు ఇషాన్ కిషన్. ముశేఖ్ వేసిన స్పీడుకు దెబ్బకు వికెట్ ఎగిరి అవతల పడిపోయిందంటే.. అతను ఎంత కసిగా బౌలింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అతని దెబ్బకు స్టార్ ఆటగాళ్లు ఔట్ అయిపోయి ముంబై తక్కువ స్కోర్ చేసింది.
Also Read:Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!
Recommended Videos: