spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan Sunrisers Hyderabad Captain 2026: సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. ఎన్నాళ్లకు...

Ishan Kishan Sunrisers Hyderabad Captain 2026: సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. ఎన్నాళ్లకు కావ్య మంచి నిర్ణయం తీసుకుంది!

Ishan Kishan Sunrisers Hyderabad Captain 2026: అద్భుతమైన ప్లేయర్లు.. అంతకుమించిన ఆర్థిక సంపత్తి.. అయినప్పటికీ సన్ రైజర్స్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వల్ల ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడేది. ట్రోఫీ గెలిచే సామర్థ్యం ఉన్నప్పటికీ.. చివరి దశలో తల వంచేది. 2016లో ఐపిఎల్ టోల్ ఫ్రీ గెలిచిన హైదరాబాద్ జట్టు.. 2024లో మళ్లీ ఫైనల్ వెళ్ళింది. మధ్యలో అన్నేసి సీజన్లలో హైదరాబాద్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

2024లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ సరిగా లేకపోవడంతో ఓడిపోవలసి వచ్చింది. 2025 లో హైదరాబాదు చెప్పుకునే స్థాయిలో ఆడలేదు. మరోవైపు గత సీజన్లో కెప్టెన్ కమిన్స్ గొప్పగా బౌలింగ్ చేయలేదు. అతడి నాయకత్వ లోపం కూడా జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త సారథి కావాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే హైదరాబాద్ యాజమాన్యం మాత్రం కమిన్స్ మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచింది. ఫలితంగా ఈ సీజన్ కు కూడా అతడే సారధి అని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే అతడి వెన్నునొప్పి తగ్గే అవకాశం లేకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఉన్నారు.

జాతీయ మీడియాలో మొన్నటి నుంచి హైదరాబాద్ జట్టుకు కాబోయే సారధి అభిషేక్ శర్మ అని ప్రచారం జరిగింది.. దీనిపై హైదరాబాద్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. అభిషేక్ శర్మనే సారధి అని అందరూ అనుకున్నారు. ఈ ఊహగానాలకు హైదరాబాద్ యాజమాన్యం తెరదించింది. సారధిగా అభిషేక్ శర్మను కాకుండా, ఇషాన్ కిషన్ ను నియమించింది. అంతేకాదు.. అభిషేక్ శర్మ నొచ్చు కోకుండా అతడిని వైస్ కెప్టెన్ చేసింది.

ఇషాన్ కిషన్ ఇటీవల జరిగిన డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. అంతకుముందు అండర్ 19 జట్టుకు అతడు సారథిగా వ్యవహరించాడు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అతడు భీకరమైన ఫామ్ కొనసాగించాడు. టీమ్ ఇండియా గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఇషాన్ కిషన్ వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపించింది. అంతేకాదు అతడి నాయకత్వాన్ని బలంగా నమ్మింది. అయితే ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్ అని హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. కమిన్స్ వెన్ను నొప్పి తగ్గిన తర్వాత అతడు జట్టులోకి వస్తాడని.. సారధ్య బాధ్యతలు స్వీకరిస్తాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు కోలుకోవడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ ప్రకారం ఈ సీజన్ మొత్తం హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ సారధిగా ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ ను సారధిగా నియమించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి. చాలా రోజులకు కావ్య మారన్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version