Homeక్రీడలుIshan Kishan wedding: త్వరలో ఇషాన్ కిషన్ పెళ్లి.. కాబోయే వధువు ఎవరు? ఆమె నేపథ్యం...

Ishan Kishan wedding: త్వరలో ఇషాన్ కిషన్ పెళ్లి.. కాబోయే వధువు ఎవరు? ఆమె నేపథ్యం ఏంటంటే?

Ishan Kishan wedding: టీమిండియా స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో రకరకాలుగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి..

ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీమిండియా టి20 జట్టులో దూకుడుగా ఆడుతున్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపించిన తర్వాత.. అతడు న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ లో అదరగొట్టిన తర్వాత.. అతడికి టి20 వరల్డ్ కప్ లో చోటు లభించింది.

టి20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమవుతున్నప్పటికీ..ఇషాన్ కిషన్ మాత్రం సత్తా చూపిస్తున్నాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర ప్లేయర్లు విఫలమైనప్పటికీ.. అతడు మాత్రం అంతకుమించి అనే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు.

మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో ఔట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా స్కోర్ వేగం నెమ్మదించింది. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అయిన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ది పురస్కారం అందుకున్నాడు.

ఇషాన్ కిషన్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. టి20 వరల్డ్ కప్ పూర్తి అయిన తర్వాత.. ఇషాన్ కిషన్ ఒక ఇంటివాడు అవుతాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇషాన్ కిషన్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. అతడి నెచ్చెలి తాత చెప్పిన మాటల ద్వారా విషయం బయటకు వచ్చింది.

ఇషాన్ కిషన్ అదితి హుండియా అనే యువతితో కొంతకాలంగా సంబంధం లో ఉన్నాడు. త్వరలోనే అతడు ఆమెను వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఆదితి ఇషాన్ కిషన్ కు సంబంధించిన అన్ని విషయాలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంది. ” వారి రిలేషన్ గురించి తెలుసు. త్వరలోనే ఆమెను అతడు వివాహం చేసుకుంటాడని మాకు తెలుస్తోంది. వారి ప్రేమకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని” ఆదితి తాత అనురాగ్ పాండే పేర్కొన్నాడు.

అదితి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతానికి చెందిన ఒక మోడల్. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. మిస్ దివా 2018 టైటిల్ గెలుచుకుంది. తర్వాత ఆమె విశేషమైన గుర్తింపు పొందింది. 2017లో మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ పరిశ్రమలో తన కెరియర్ ను అభివృద్ధి చేసుకుంది. సోషల్ మీడియాలో బలమైన అభిమానులను సొంతం చేసుకుంది…

ఇంస్టాగ్రామ్ లో ఆమెను 2,85,000 మంది అనుసరిస్తున్నారు. ఇటీవల ఇషాన్ కిషన్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన వీడియోలను.. ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.. టి20 వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత ఇషాన్ కిషన్ అదితి మెడలో మూడు ముళ్ళు వేస్తాడని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular