IND vs WI : భారత్ పై విండీస్ గెలుపు మంత్రం ఇదేనా?

ఇలా మ్యాచ్ ఓడిపోవడానికి చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. ఇప్పటికైనా, ఈ సిరీస్ పోగొట్టుకున్న తర్వాత అయినా టీం ఇండియాలో కాస్త చలనం వస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.

Written By: Vadde, Updated On : August 14, 2023 10:18 pm
Follow us on

IND vs WI : ఐదు మ్యాచ్ ల సిరీస్ ను వెస్టిండీస్ ఎంతో చాకచక్యంగా ఆడి మొదట్లోనే టీమ్ ఇండియాను 0-2 ఆధిక్యతతో ప్రెజర్ లోకి నెట్టింది. మొదటి రెండు మ్యాచ్లలో కెప్టెన్ హార్దిక్ పాండే తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్ చేతుల నుంచి జారిపోయింది. మరోవైపు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన సత్తా చాటుతూ మంచి స్కోర్ సాధించాడు.

రెండు మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే రెండు మ్యాచ్లు మనం గెలిచాం.. దీంతో ఐదవ టి20 మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది ఎంతో ఉత్కంఠతను రేపింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ ప్లేయర్స్ అనూహ్యంగా చెలరేగి ఆడి 3-2 స్కోర్ తో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని సెంట్రల్ పార్క్ స్టేడియంలో ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్ ఒక రేంజ్ టెన్షన్ క్రియేట్ చేసింది.

బ్రాండన్ కింగ్ 85 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలవడంతో చివరిదైన ఐదవ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ మంచి స్కోర్ సాధించగలిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి165 పరుగులు సాధించింది. సూర్య కుమార్ యాదవ్ 45 బంతుల్లో 61 రన్స్ సాధించి భారత్ స్కోరుబోర్డుని పరుగులు పెట్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు 165 పరుగులు సునాయాసంగా సాధించిందని చెప్పవచ్చు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లు పూర్తికాకముందే సులభంగా లక్ష్యాన్ని సాధించింది. 2017 తర్వాత తిరిగి ఇప్పుడు వెస్టిండీస్ భారత్ పై మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. హర్షదీప్ సింగ్ బౌలింగ్ రెండవ ఓవర్లో కైల్ మేయర్స్ పెవిలియన్ చేరుకున్నప్పటికీ విండీస్ జట్టు తన అధిపత్య రన్ కొనసాగించింది. కింగ్ మరియు పూరన్ ఇద్దరు ఇండియన్ బౌలర్లను స్టేడియం మొత్తం పరిగెత్తించారు.

మొదటి రెండు మ్యాచ్ లలో బాగా తడబడిన భారత్ మూడవ మ్యాచ్ నుంచి కసరత్తు మొదలుపెట్టడమే కాకుండా మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. మూడవ మరియు నాలుగవ టి20 మ్యాచ్లో భారత్ ప్రదర్శన చూసి కప్పు కచ్చితంగా ఇండియన్ టీం దే అని ఫిక్స్ అయిన వాళ్ళ అంచనాలు ఐదవ టి20 మ్యాచ్ రిజల్ట్స్ తో తలకిందులు అయ్యాయి.

తమ విజయం గురించి ప్రస్తావించినటువంటి విండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ,సంజూ శాంసన్ లను అవుట్ చేయడం కోసం తాను పన్నిన వ్యూహం గురించి చర్చించడం జరిగింది. సంజు ని అవుట్ చేయాలి అంటే.. వికెట్ను నేరుగా కొట్టాలి. అలాగే సూర్య విషయంలో అతను బాల్ ని గ్రౌండ్ లోకి స్ట్రైట్ కట్ కొట్టే విధంగా చూడాలి.. ఇది నేను వాళ్ళిద్దరి ఆట తీరు చూసి అర్థం చేసుకున్న విషయం. ఇటువంటి టెక్నిక్స్ పాటించాము కాబట్టి భారత్ వంటి జట్టు పై గెలవడం మాకు సులభం అయింది అని అన్నారు.

మనం గెలవాలి అంటే కేవలం మన శక్తి మనకు తెలిస్తే చాలదు అవతల వాళ్ళ వీక్నెస్ కూడా తెలియాలి అని అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సూత్రాన్ని ఈరోజు విండీస్ ప్లేయర్లు ఆచరించి మరీ చూపించాడు. కానీ మన ప్లేయర్స్ కి మాత్రం అవతల టీం లో ఇటువంటి వీక్నెస్ లు ఏవి కనిపించకపోవడం, తడబడే మిడిల్ ఆర్డర్ ఉండడం, బ్యాటర్ల బ్యాట్ కు సత్తా తగ్గడం.. ఇలా మ్యాచ్ ఓడిపోవడానికి చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. ఇప్పటికైనా, ఈ సిరీస్ పోగొట్టుకున్న తర్వాత అయినా టీం ఇండియాలో కాస్త చలనం వస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.