KL Rahul: మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ ఎడిషన్ మొదలుకానుంది. ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. 18 ఎడిషన్ ను ఘనంగా నిర్వహించడానికి ఐపీఎల్ నిర్వహణ కమిటీ భారీగా ఏర్పాట్లు చేసింది.
Also Read: టీమిండియా గెలిచిన ఊపులో..వీళ్ళను మర్చిపోయాం..ఇందులో మన ఇండియన్ కూడా ఉన్నాడు..
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 12 రోజులు సమయం ఉంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే ఢిల్లీ జట్టు కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఐపిఎల్ లో లక్నో జట్టుకు రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. లక్నో జట్టు యజమాని తో నెలకొన్న వివాదం వల్ల కేల్ రాహుల్ మన స్థాపానికి గురయ్యాడు. మైదానంలోనే కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు యజమాని నిలదీసినంత పనిచేశాడు. దీంతో అప్పుడే కెల్ రాహుల్ మనస్థాపానికి గురయ్యాడు. అందరూ ఊహించినట్టుగానే ఇటీవల జరిగిన మెగా వేలంలో కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. నీతో ఢిల్లీ జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేసింది. కేల్ రాహుల్ తో పాటు అక్షర్ పటేల్ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నాడు. గత సీజన్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. అయితే రిషబ్ పంత్ ను లక్నో జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు అతడు సారధ్యం వహించే అవకాశం కనిపిస్తోంది.
అక్షర్ పటేల్ కెప్టెన్ కావడం ఖాయం..
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ కీలకంగా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్, న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టి.. టీమ్ ఇండియాను విజేతగా నిలిపాడు. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ అక్షర్ పటేల్ తో కలిసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అత్యంత విలువైన 60+ పరుగులు జోడించారు.. తద్వారా టీమిండియా విజయం వైపు ప్రయాణించింది. తన బ్యాటింగ్ ఇటీవల మెరుగైన నేపథ్యంలో.. దానికి మరింత సాన పెట్టేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నాడు. అందువల్లే పూర్తిగా బ్యాటింగ్ మీద దృష్టి సారించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు సారధ్య బాధ్యతలు అప్పగించద్దని ఢిల్లీ యాజమాన్యాన్ని అతడు కోరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ” కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మెరుగయింది. ఒకప్పటి కంటే అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అది నిరూపితమైంది. అందువల్లే అతడు తన బ్యాటింగ్ ను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదే క్రమంలో తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించొద్దని ఢిల్లీ యాజమాన్యాన్ని కోరాడు. దీంతో అక్షర్ పటేల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని” జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.