spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.. ఫలితంగా అతడు దాదాపు సంవత్సరానికి మించి జట్టుకు దూరంగా ఉండిపోయాడు. అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు. దీంతో మళ్లీ జట్టులోకి ప్రవేశించాడు.

టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. దీంతో మనవాడు గాడిలో పడ్డట్టే అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా సత్తా చూపించాడు. ఫలితంగా జట్టులో ఫస్ట్ ప్రియారిటి ఆప్షన్ అయిపోయాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. పరుగుల యంత్రంలాగా రన్స్ తీసే అతడు దారుణంగా అవుట్ అవ్వడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మేనేజ్మెంట్ ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాడు. అతడే ఇషాన్ కిషన్.

ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్లో రెండు టీ20 లలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్లో 0, 49, 13, 4, 56 పరుగులు చేశాడు. రెండు బండిలలో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ మైదానాల మీద స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికా లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎలా ఆడతాడో అర్థం కావడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో బౌన్సీ మైదానాలు ఉంటాయి. అటువంటి వాటి మీద అతడు బ్యాటింగ్ చేయడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బౌన్సీ మైదానాల మీద జరిగే వరల్డ్ కప్ కు అతడిని ఎంపిక చేయకపోవడమే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరి తన లోపాన్ని కిషన్ ఎలా అధిగమిస్తాడు.. స్వేచ్ఛగా ఎలా బ్యాటింగ్ చేయగలుగుతాడో చూడాల్సి ఉంది.

ఐపీఎల్ లో కిషన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. హైదరాబాద్ జట్టు తరఫున అదరగొట్టాడు. కానీ జాతీయ జట్టుకు వచ్చేసరికి అతని ఆట తీరు పూర్తిగా మారిపోయింది. అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నాడు. బంతుల వేగాన్ని అంచనా వేయలేకపోతున్నాడు. గమనాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అందువల్లే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ మీద చివరి మ్యాచ్లో కిషన్ గనుక నిలబడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ అతడు నిర్లక్ష్యమైన ఆట తీరు కొనసాగించాడు. టీమిండియా ఓటమికి కారకులలో ఒకడయ్యాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version