spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL playoff qualification scenarios 2026: ఈ మూడు జట్లకు ప్రతి మ్యాచ్ లో గెలుపే...

IPL playoff qualification scenarios 2026: ఈ మూడు జట్లకు ప్రతి మ్యాచ్ లో గెలుపే కాదు, అంతకుమించి కావాలి.. అలాగైతేనే ప్లే ఆఫ్ కు..

IPL playoff qualification scenarios 2026: ఐపీఎల్ ప్రథమార్ధం ముగింపు దశకు చేరుకుంది.. ఇప్పటికే కొన్ని జట్లు వరుస విజయాలతో ముందు వరుసలో ఉంటే.. మిగతా జట్లు ఓటములతో ఇబ్బందులు పడుతున్నాయి.. వాస్తవానికి ఐపీఎల్ అంటేనే పోటీ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలో ఓడిపోయిన జట్లు సత్తా చూపించాల్సిన సందర్భం వచ్చేసింది.

2026 ఐపిఎల్ లో పాయింట్లు పట్టికలో చివరి మూడు స్థానాల్లో లక్నో, ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు కొనసాగుతున్నాయి. ఈ జట్లకు ప్రతి మ్యాచ్ చావో రేవో లాంటిదే. ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే కచ్చితంగా ఈ జట్లు వరుస విజయాలు సాధించాలి. భారీ అంతరంతో గెలుపును దక్కించుకోవాలి.. లక్నో జట్టుకు ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్నాయి. ముంబై జట్టుకు నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు ఐదు మ్యాచ్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ జట్లు గెలవాలి. అదే కాదు భారీ అంతరంతో విజయం సాధించిన తర్వాత.. ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాలి.

ముంబై జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నోపై అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం మాత్రమే కాకుండా.. ఇంకా చాలా గెలుపులు సాధించి.. నెట్ రన్ రేట్ పెంచుకోవాలి. ఇతర జట్ల ఫలితాలను కూడా తనకు అనుకూలంగా వచ్చేలా కోరుకోవాలి. ముంబై మాత్రమే కాదు, లక్నో, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రహానే వ్యూహాలు పకడ్బందీగా ఉంటేనే ఈ జట్లు గెలిచే అవకాశం ఉంది.

ఇక పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదింటిలో రెండు మ్యాచ్లు గెలవాలి. అలా గెలిస్తే అవి ప్లే ఆఫ్ వెళ్లిపోతాయి. హైదరాబాద్, రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్ తలా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కనీసం రెండు మ్యాచ్లలో అద్భుతమైన విజయాలు అందుకుంటే ఈ జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోతాయి.. చెన్నై సూపర్ కింగ్స్, హెలికాపిటల్స్ ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. అందులో కూడా భారీ అంతరంతో విజయం సాధించాలి. అప్పుడే ఆ జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోతాయి.

ఇటీవల పంజాబ్, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఊహించని విధంగా ఓటములు ఎదుర్కొన్నాయి. ఈ ఓటములు ఆ జట్ల గణాంకాలలో పెద్దగా మార్పులు తీసుకురాలేకపోయినప్పటికీ.. ఐపీఎల్ పోటీని మాత్రం రసవత్తరంగా మార్చేశాయి. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్లలో పది జట్లు ఎలా ఆడతాయి.. అభిమానులకు ఎలాంటి క్రికెట్ వినోదాన్ని అందిస్తాయనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper
Exit mobile version