IPL 2026 Playoffs: ఐపీఎల్ అభిమానుల అచనాలకు అందని విధంగా సాగిపోతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్లు ఓటమిపాలవుతున్నాయి. దీంతో గణాంకాలు మారిపోతున్నాయి. సమీకరణాలు తారు మారవుతున్నాయి. దీంతో ఏ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది.. ఏ జట్టు ఇంటికి వెళుతుంది.. అనే ప్రశ్నలు అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
ఐపీఎల్ లో పంజాబ్ జట్టు వరుసగా ఆరు విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా 5 ఓటములను నమోదు చేసింది.. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు తలకిందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆదివారం బెంగళూరుతో జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉండవు.
అందువల్లే చెన్నై అభిమానులు పంజాబ్ గెలవకూడదని.. బెంగళూరు గెలవాలని పూజలు చేస్తున్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు 8 విజయాలు, నాలుగు ఓటములతో ఐపీఎల్ లో మిగతా చెట్లకు అందనంత ఎత్తులో ఉంది. బెంగళూరు జట్టుకు నెట్ రన్ రేటు అద్భుతంగా ఉంది . ఈ జట్టు 1.053 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది.
పంజాబ్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఆరు విజయాలు.. ఐదు ఓటములను నమోదు చేసింది. నెట్ రన్ రేట్ +0.355 తో కొనసాగుతోంది. ముంబై తో ఓడిపోవడం ఈ జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బెంగళూరు తో ఒకవేళ ఈ జట్టుకు ఓడిపోతే.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉండవు. లక్నో జట్టుతో గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. పంజాబ్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మార్గం సుగమం అవుతుంది. ఈ చెట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి..+0.027 నెట్ రన్ రేట్ ఉంది. జట్టు ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ క్యాపిటల్స్ తో ఆడాల్సి ఉంది. పంజాబ్ ఓడిపోయి.. చెన్నై వరుసగా రెండు మ్యాచ్లో గెలిస్తే.. అప్పుడు దర్జాగా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోకుండా ఉంటే ఈ జట్టుకు బాగుండేది. అందువల్లే నేటి మ్యాచ్లో బెంగళూరు గెలవాలని.. పంజాబ్ ఓడిపోవాలని చెన్నై అభిమానులు భావిస్తున్నారు.