IPL Mumbai Team 2022: ముంబై ఇండియన్స్ టీం.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు ఇబ్బంది పడటం.. తర్వాత పుంజుకుని ఆడటం.. చివరి సమయంలో రెచ్చిపోవడం.. ఇలాంటివన్నీ ఈ టీమ్ కు రొటీన్ అనే చెప్పాలి. ఎవరూ ఊహించిన విధంగా టైటిల్స్ కొట్టడంలోనూ ఈ టీం దిట్ట అనే చెప్పాలి. ఐపీఎల్ ఫస్ట్ ఐదు సీజన్స్‌లో ఫైనల్ వరకు చేరుకుంది ముంబై టీం. తర్వాత ఎనిమిది సీజన్లలో ఐదు టైటిల్స్ కొట్టింది.
ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. కోచ్‌గా మహేల జయవర్ధనే వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై సాధించిన ఐదు ట్రోపీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే గెలుచుకోవడం విశేషం. ఎంఎస్ ధోని తర్వాత అంతలా ప్రశాంతంగా ఉండే కెప్టెన్ గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు. ఈ రికార్డులతోనే టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను చేజిక్కించుకున్నాడు. ఈ సారి వేలంలో ఇషాన్ కిషన్ కోసం టీం మేనేజ్ మెంట్ ఎక్కువగానే ఖర్చు చేసింది. ఏకంగా రూ.15.25 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ వేలంలో ఒక ప్లేయర్ కోసం ముంబై ఇండియన్స్ రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇక హార్దిక్ పాండ్యా ప్లేస్ ను భర్తీ చేసేందుకు టీమ్ డేవిడ్‌ను కొనుగోలు చేసింది ముంబై..
Also Read: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?
టీమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ కీలక ప్లేయర్స్. జోఫ్రా ఆర్చర్ నెక్స్ట్ సీజన్ నుంచి అందుబాటులో ఉండనున్నాడు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా ఎవరికీ తెలియని ప్లేయర్సే. ఈ టీంకు ఓపెనింగ్ సమస్య లేదు.
ఇక వేలంలో దక్కించుకున్న వారి వివరాలు పరిశీలిస్తే రోహిత్ శర్మను రూ.16 కోట్లకు కొనుగోలు చేయగా, జస్‌ప్రీత్ బుమ్రా రూ.12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ రూ.8 కోట్లు, కీరన్ పొలార్డ్ రూ.6 కోట్లు, ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్లు, టీమ్ డేవిడ్ రూ.8.25 కోట్లు, జోఫ్రా ఆర్చర్ రూ.8 కోట్లు, డేవాల్డ్ బ్రేవిస్ రూ.3 కోట్లు, డానియల్ సామ్స్ రూ.2.60 కోట్లు, తిలక్ వర్మ రూ.1.70 కోట్లు, మురుగన్ అశ్విన్ రూ.1.6 కోట్లు, టైమల్ మిల్స్ రూ.1.50 కోట్లు, జయదేవ్ ఉనాద్కత్ రూ.1.30 కోట్లు, రిలే మెరిడిత్ రూ. కోటి, ఫాబియన్ అలెన్ రూ.75 లక్షలు, మయాంక్ మార్కండే రూ.65 లక్షలు, సంజయ్ యాదవ్ రూ.50 లక్షలు, బసిల్ థంపీ రూ.30 లక్షలు, అర్జున్ టెండూల్కర్ రూ.30 లక్షలు, అన్మోల్ ప్రీత్ సింగ్, రమన్ దీప్ సింగ్, ఆర్యన్ జుయల్, రాముల్ బుద్ది, హ్రితీక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్‌ను రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేసింది.
Also Read: Aam Admi in Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు షాకిస్తూ ఆమ్ ఆద్మీ రె‘ఢీ’