Homeక్రీడలుIPL 2023 Final : ఐపీఎల్‌ ఫైనల్‌.. గుజరాత్‌ – చెన్నై మ్యాచ్‌.. ఈ రికార్డులకు...

IPL 2023 Final : ఐపీఎల్‌ ఫైనల్‌.. గుజరాత్‌ – చెన్నై మ్యాచ్‌.. ఈ రికార్డులకు సిద్ధం!

IPL 2023 Final : ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేత ఎవరనేది తేలాలంటే ఆదివారం సాయంత్రం వరకు ఆగాల్సిందే. గుజరాత్‌ – చెన్నై మధ్య ఫైనల్‌ పోరు జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 2023 సీజన్‌ ఫైనల్‌కు అహ్మదాబాద్‌ వేదిక. రాత్రి 7.30 గంటలకు అసలైన సమరం ప్రారంభం అవుతుంది. వరుసగా రెండో ఏడాది టైటిల్‌ గెలవాలని గుజరాత్‌ ఆశిస్తోంది. మరోవైపు ఐదో కప్‌ను ఖాతాలో వేసుకోవాలని చెన్నై ఉవ్విళ్లూరుతోంది.
రికార్డులకు చాన్స్‌.. 
– రెండో క్వాలిఫయర్‌లో సెంచరీతో కదం తొక్కిన శుభ్‌మన్‌ గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అందరి కంటే ముందే ఉన్నాడు. ప్రస్తుతం 851 పరుగులు చేశాడు. అయితే, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించేందుకు గిల్‌ సరిగ్గా 122 పరుగుల దూరంలో ఉన్నాడు. ముంబయిపై సెంచరీ చేసిన ఊపులో ఉన్న మరోసారి అదే ప్రదర్శన చేస్తే విరాట్‌(973)ను అధిగమిస్తాడు.
– ఒకే జట్టు నుంచి ముగ్గురు బౌలర్లు పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలవడం విశేషం. మహమ్మద్‌ షమీ (28 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌(27 వికెట్లు), మోహిత్‌ శర్మ (24 వికెట్లు) ఉన్నారు. చెన్నైతో మ్యాచ్‌లో రషీద్‌ ఒక్క వికెట్, మోహిత్‌ నాలుగు వికెట్లు తీస్తే ముగ్గురు బౌలర్లు 28 వికెట్లతో ఉంటారు. ఇలా ఒకే సీజన్‌లో ఒకే జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఉండటం కూడా ఓ రికార్డే.
– ప్రస్తుతం నాలుగుసార్లు టైటిల్‌ సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదోసారి విజేతగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు. ధోనీకిదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో సహచరులు గిఫ్ట్‌ ఇస్తారో లేదో వేచి చూడాలి. అయితే, సీఎస్‌కే ఈసారి విజేతగా నిలిస్తే మాత్రం ముంబయితో సమంగా నిలుస్తుంది. ముంబయి ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. చెన్నైకూడా గెలిస్తే రెండు జట్లు సమం అవుతాయి.
– ఇక ఐపీఎల్‌ను వరుసగా రెండుసార్లు గెలిచిన జట్టు ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రమే. ఇప్పుడు ఆ అవకాశం గుజరాత్‌ టైటాన్స్స్‌కు వచ్చింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఫైనల్‌కు చేరడంతో రెండో సారి విజేతగా నిలిచి చెన్నై సరసన చేరుతుందో లేదో మరి.
– ఎంఎస్‌.ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ను గెలిస్తే ఐపీఎల్‌ చరిత్రలో మరో అద్భుతమైన రికార్డుగా మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ధోనీ పేరిట అరుదైన ఘనత నమోదవుతుంది. అత్యధిక వయసులో ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గిన జట్టు సారథిగా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు.
– రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో 36 పరుగులు చేస్తే ఈ సీజన్‌లో 600 రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular