Gujarat Titans IPL 2022 Champion: మోచేతిలో బలముంటే మొండి కొడవలైనా తెగుతుంది. ఆడలేక మద్దెల ఓడు అనేవి సామెతలు. కొంతమంది పనితనంపై ప్రభావం చూపిస్తే మరికొందరు అదృష్టాన్ని నమ్ముకుని అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. ఐపీఎల్ సీజన్ 2022లో కొత్తగా అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ అందరి అంచనాలు తలకిందులు చేసింది. టైటిల్ పోరులో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. కొత్తగా కూర్చిన జట్టయినా తన ప్రతిభతో అన్ని మ్యాచుల్లో విజయాలే ప్రధానంగా ముందుకు సాగింది. దీంతో ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ను మట్టికరిపించి కప్ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ కప్ గెలుచుకోవాలని చాలా జట్లు ప్రయత్నించినా చివరకు గుజరాత్ టైటాన్స్ సత్తా చాటి తానేమిటో నిరూపించుకుంది. కొత్త జట్లయినా అలవోకగా విజయాలు సాధిస్తూ అందరిని ఆకర్షించారు. పాత జట్లను తోసిరాజని కొత్తగా వచ్చిన గుజరాత్ ప్రతి మ్యాచులోనూ అందరి లెక్కఐపీఎల్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్..ఇంత ఈజీగా ఎలా గెలవగలిగింది?లు తారుమారు చేసింది. విజయాల పరంపరలో ఎదురు లేకుండా పోయంది. దీంతో టైటిల్ ఫేవరేట్ గా నిలిచి నెంబర్ వన్ జట్టుగా ఖ్యాతి గడించింది. తుదికంటా రసవత్తరంగా సాగిన పోరులో విజయమే లక్ష్యంగా చెలరేగింది. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది.
Also Read: Amalapuram Incident: మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టినా ఎందుకు చర్యల్లేవ్.? ఏంటి కథ?
హైదరాబాద్ సన్ రైజర్స్, ముంబయ్ ఇండియన్స్, కోల్ కత నైట్ రైడర్స్, బెంగుళూరు చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టాటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు బరిలో ఉండగా ఫైనల్ కు గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ చేరాయి. దీంతో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ తన సత్తా చాటింది. ఆటగాళ్ల మధ్య ఉన్న సమష్టి పోరుతో జట్టు విజయం సాధించింది. కప్ గెలవాలన్న ఆకాంక్ష అందరిలోనూ కనిపించింది. అందుకే మొదటి నుంచి కసిగా ఆడి విజయం ముంగిట నిలిచారు. ఈ విజయంతో వారి కల నెరవేరింది.
గుజరాత్ టైటాన్స్ మొదటి సారి రంగంలోకి దిగినా ఆటగాళ్ల మధ్య సహకారం బాగుంది. అందరు సమష్టిగా ఆడి జట్లుకు మరుపురాని విజయం అందించారు. టైటిల్ నెగ్గి తమకు ఎదురు లేదని నిరూపించారు. తమదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నారు. రాజస్తాన్ రాయల్స్ ను ఓడించి తమకు చిరస్మరణీయమైన గెలుపు సాధించడం విశేషం. అందుకే గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యులను అందరు ప్రశంసించారు. వారి పోరాటం అందరికి స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి కప్ గెలిచి తమపై అబిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
గుజరాత్ టైటాన్స్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా సాగింది. గుజరాత్ జట్టులో ఎవరు కూడా టెన్షన్ ఫీల్ కాలేదు. సులువుగా మ్యాచ్ నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. గుజరాత్ జట్టులో ఆటగాళ్లలో ఎవరికి కూడా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం రాకపోవడం గమనార్హం.
Also Read:CM KCR-KTR: దసరాకు కేసీఆర్ నిర్ణయం..కేటీఆర్ సీఎం కాబోతున్నారా?