Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 RCB vs SRH match preview: 22 మంది ప్లేయర్లున్నా.. అందరి కళ్ళు...

IPL 2026 RCB vs SRH match preview: 22 మంది ప్లేయర్లున్నా.. అందరి కళ్ళు వీరి మీదే..

IPL 2026 RCB vs SRH match preview: ఐపీఎల్ లో గొప్పగా ఆడే వాళ్లకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. యాజమాన్యాలు కూడా వారి మీదనే విపరీతంగా డబ్బులు కురిపిస్తూ ఉంటాయి. వేలంలో భారీ ధరకు సొంతం చేసుకుంటాయి. కొన్ని సందర్భాలలో గొప్ప ప్లేయర్లు సరిగా ఆడకపోవచ్చు. అంచనాలు ఏ మాత్రం నేను ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలగిపోవచ్చు. అందువల్లే ఐపిఎల్ స్థిరత్వానికి.. అస్థిరత్వానికి మారుపేరు.

2026 సంవత్సరానికి సంబంధించి ఐపిఎల్ ఈరోజు మొదలు కాబోతోంది. తొలి మ్యాచ్ బెంగళూరు.. హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండు జట్లలో భీకరమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత సీజన్లో సొంత మైదానంలో ఆడిన మూడు మ్యాచ్లలో బెంగళూరు ఓడిపోయిన నేపథ్యంలో.. కాస్త ఆ జట్టు ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ మైదానం లో ఏర్పాటుచేసిన పిచ్ కాస్త భిన్నంగా ఉందని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ పిచ్ మీద అవగాహన పెంచుకోవడానికి గడిచిన పది రోజులుగా రెండు చెట్లకు సంబంధించిన ప్లేయర్లు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

రెండు జట్లలో 22 మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ప్రధానంగా నలుగురు మీద అభిమానులు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా వీరి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతుంది..

విరాట్ కోహ్లీ

బెంగళూరులో విరాట్ కోహ్లీ.. బెతల్ ప్రధానంగా కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ జట్లతో జరిగిన సిరీస్లలో దుమ్మురేపాడు. పైగా అతడు ప్రాక్టీస్ లో తీవ్రంగా మునిగి తేలిపోతున్నాడు. కనీసం బయట కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేడు. ఇటీవల నమన్ అవార్డులకు కూడా అతడు రాలేదు. కులదీప్ యాదవ్ పెళ్లికి కూడా హాజరు కాలేదు. విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో అతడి నుంచి పరుగుల వరద రావడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.

బెతల్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు బెంగళూరులో కీలకమైన ప్లేయర్గా రూపాంతరం చెందాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో దుమ్మురేపాడు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో శివతాండవం చేశాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ.. మూల స్తంభం మాదిరిగా నిలబడి పరుగుల వరద పారించాడు. ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు అభిమానులు ఇతడి మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అభిషేక్ శర్మ

హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ.. కిషన్ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అంత గొప్పగా ఆడకపోయినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే ఫోర్లు.. సిక్సర్లు కొట్టి న్యూజిలాండ్ బౌలింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లో అతడు అదే స్థాయిలో ఆడతాడని.. మెరుపు వేగంతో పరుగులు తీస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇషాన్ కిషన్

ఆరు నెలల నుంచి కిషన్ క్రీడా ప్రస్థానం పూర్తిగా మారిపోయింది. డొమెస్టిక్ క్రికెట్లో ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపిన తర్వాత అతని ఆట తీరు మొత్తం మారిపోయింది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో అతడు అద్భుతమైన ఆట తీరు కొనసాగించాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇప్పుడు సారధిగా హైదరాబాద్ జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అతడు తిరుగులేని ఫామ్ లో ఉండడంతో.. మెరుపు ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular