IPL 2025 Bangalore vs Punjab : లీగ్ దశను అత్యంత విజయవంతంగా ముగించిన చరిత్ర బెంగళూరుది. తన చివరి మ్యాచ్ లక్నోపై వీరోచితంగా ఆడింది. ఏకంగా ఆరు వికెట్ల వ్యత్యాసంతో హిస్టారికల్ విజయం సాధించింది.. ఐపీఎల్ హిస్టరీలో బెంగళూరుకు ఇదే అతిపెద్ద సక్సెస్ ఫుల్ రన్ చేజింగ్. ఇక పంజాబ్ కూడా ముంబై పై ఘనవిజయం సాధించింది. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా భీకరంగా బ్యాటింగ్ చేసి.. బలమైన ముంబై జట్టును పడుకోబెట్టింది. ముల్లాన్ పూర్ వేదికపై బెంగళూరుకు అద్భుతమైన రికార్డు ఉంది. మరీ ముఖ్యంగా పంజాబ్ జట్టుపై టెర్రిఫిక్ రికార్డు ఉంది.
ముల్లాన్ పూర్ లో పంజాబ్ జట్టుకు సొంతమైదానం అయినప్పటికీ.. ఇక్కడ చెప్పుకునే స్థాయిలో గొప్ప రికార్డు లేదు.. ఈ మైదానంలో ఈ సీజన్లో పంజాబ్ నాలుగు మ్యాచ్లు ఆడితే.. రెండిట్లో ఓడిపోయింది. సరిగా ఏప్రిల్ 20న లీగ్ స్టేజిలో ఈ మైదానంలో బెంగళూరు తో పంజాబ్ తలపడింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఏడు వికెట్ల వ్యత్యాసంతో బెంగళూరు చేతిలో ఓడిపోవలసి వచ్చింది. నాటి మ్యాచ్లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 157 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ ను బెంగళూరు 18.5 ఓవర్లలో చేసింది. అయితే నాటి సీన్ మరొకసారి రిపీట్ అయితే పంజాబ్ జట్టుకు ఇబ్బంది తప్పదు.
Also Read : లక్నోతో కీలకమైన మ్యాచ్ వేళ.. బెంగళూరు జట్టు కెప్టెన్ ఎక్కడ?
పంజాబ్ జట్టు లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్లలో ఒక దాంట్లో ఓడిపోయి.. మరొక దాంట్లో గెలిచింది. గెలవాల్సిన మ్యాచ్లో తడాఖా చూపించి సత్తా చాటింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. బౌలింగ్ పరంగా ఆ జట్టు బెంగళూరు తో సరి సమానంగా ఉంటుంది. బ్యాటింగ్లో అయితే భీకరమైన హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు.. మొత్తంగా బెంగళూరుకు వారితో ఇబ్బంది తప్పదు. పైగా క్రితం మ్యాచ్లో బెంగళూరు బౌలర్లో అంతగా ప్రభావితం చేయలేకపోయారు.. ముల్లాన్ పూర్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, అయ్యర్, జోస్ ఇంగ్లిస్ వంటి వారు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. మార్కో జాన్సన్, అర్ష్ దీప్ సింగ్ లాంటి బౌలర్లు అద్భుతాలు చేస్తున్నారు. ముంబై జట్టుపై వీరిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఇక బెంగళూరు ఈ సీజన్లో ప్రత్యర్థి మైదానంలో ఆడిన ఏడు మ్యాచ్లలో ఏడూ గెలిచింది.. కాబట్టి క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బెంగళూరు ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తే పంజాబ్ జట్టుకు ఇబ్బంది తప్పదు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 35 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 18 పంజాబ్ గెలిచింది. బెంగళూరు 17 మ్యాచ్లలో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో నువాన్ తుషారా, కృణాల్ పాండ్యా మినహా మిగతా వారంతా దారుణంగా పరుగులు ఇస్తున్నారు. అలాగని వీరు క్రితం మ్యాచ్లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయారు. బౌలింగ్ లో లోపం బెంగళూరును ఇబ్బందికి గురిచేస్తోంది. భువనేశ్వర్ కుమార్ తేలిపోతుండడం జట్టను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ సీజన్లు రెండు చెట్లు 14 మ్యాచులు ఆడాయి. తొమ్మిది విజయాలతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ పంజాబ్ జట్టుకు +0.372 ఉండగా, బెంగళూరు జట్టుకు +0.301 గా ఉంది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఈ రెండు జట్లకు సమానంగా విజయావకాశాలు ఉన్నట్టు తెలిపింది.