IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్ల మధ్య లీగ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు సంజు సాంసన్(82), రియాన్ పరాగ్ (43) ధాటికి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సంజు మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో రాజస్థాన్ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఓపెనర్లు నిరాశపరిచినప్పటికీ వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి వచ్చిన అతడు తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేశాడు.
Most Wickets in 1st over of IPL
25 – Bhuvneshwar (684b)
23 – Trent Boult (474b)*
15 – Praveen Kumar (534b)
13 – Sandeep Sharma (468b)#RRvLSG pic.twitter.com/PHl7jemLfq— (@Shebas_10dulkar) March 24, 2024
అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆదిలోనే తడబడింది. రాజస్థాన్ బౌలర్ బెల్ట్ ధాటికి తొలి ఓవర్ ఐదో బంతి వద్ద ప్రమాదకరమైన క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయింది. దీంతో లక్నో జట్టు నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. అనంతరం రెండో బంతి వద్ద దేవదత్ పడిక్కల్ బౌల్ట్ బౌలింగ్లో క్వీన్ బోల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన ఆయుష్ బదోని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నండ్రే బర్గర్ బౌలింగ్లో జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యా. అప్పటికి రాజస్థాన్ జట్టు 11 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కే ఎల్ రాహుల్, దీపక్ హూడా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను ఎత్తుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 49 పరుగులు జోడించారు. దీపక్ హుడా(26; 13 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లు) భారీ స్కోరు సాధించే క్రమంలో యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కీపర్ ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో నికోలస్ పురన్(10), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు. కడపటి సమాచారం అందే వరకు 10 ఓవర్లు పూర్తయ్యాయి.. నాలుగు వికెట్ల నష్టానికి లక్నో 74 పరుగులు చేసింది.
Trent Boult you beauty #RRvLSG pic.twitter.com/pkhHGE3ftN
— Sudhanshu Ranjan Singh (@memegineers_) March 24, 2024
అయితే ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో ఫస్ట్ ఓవర్ లో ఎక్కువ వికెట్లు సాధించిన రెండవ బౌలర్ గా అతడు అవతరించాడు. అతడి కంటే ముందు భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. భువనేశ్వర్ కుమార్ ఆరంభ ఓవర్లలో 25 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందుకు అతడికి 684 బంతులు అవసరమయ్యాయి. బౌల్ట్ 474 బంతుల్లోనే 23 వికెట్లు సాధించాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్ లో ప్రారంభ ఓవర్ ఐదో బంతికే డికాక్ ను అవుట్ చేసి బౌల్ట్ తన ఖాతాలో 23వ వికెట్ జమ చేసుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత ప్రవీణ్ కుమార్ ఆరంభ ఓవర్లలో 15 వికెట్లు సాధించాడు. ఇందుకు అతడికి 534 బంతులు అవసరమయ్యాయి. ప్రవీణ్ తర్వాత నాలుగో స్థానంలో సందీప్ శర్మ కొనసాగుతున్నాడు. అతడు ఆరంభ ఓవర్లలో 13 వికెట్లు నేల కూల్చాడు. ఇందుకుగాను అతడికి 468 బంతులు అవసరమయ్యాయి. అటు బౌల్ట్, ఇటు బర్గర్ ధాటికి లక్నో జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఆశలు పెంచుకున్న డికాక్, దేవదత్, ఆయుష్ బదోని వెంట వెంటనే అవుట్ కావడంతో ఆ జట్టు పీకలలోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా దేవ దత్ గోల్డెన్ డక్ గా వెను తిరగడాన్ని లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అద్భుతం జరిగితే తప్ప లక్నో గెలిచేది అనుమానమేనని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.