Homeక్రీడలుIPL 2024: RCB Unbox వేడుకలు.. అదిరిపోయాయిగా..

IPL 2024: RCB Unbox వేడుకలు.. అదిరిపోయాయిగా..

IPL 2024: స్మృతి మందాన ఆధ్వర్యంలో ఇటీవల బెంగళూరు జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -24 కప్ ను దక్కించుకుంది. రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ విజయం సగటు కన్నడ అభిమానికి ఉత్సాహానిచ్చింది. కేవలం అభిమానులకే కాదు Royal challengers Bengaluru mens team కి కూడా అమితమైన ఆనందాన్నిచ్చింది. అందుకే మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే IPL 2024 టోర్నీకి రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. తొలి మ్యాచ్ లో Chennai Super Kings జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.

ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ మైదానంలో బెంగళూరు ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. దీనికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం అన్ బాక్స్ అనే వేడుక నిర్వహించింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో Royal Challengers Bengaluru అధికారిక జెర్సీని విడుదల చేసింది. జెర్సీ విడుదల చేసిన తర్వాత విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లోగో రూపొందించిన ఒక శాలువాను మెడలో వేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా కోహ్లీని అనుసరించారు. అలా తమ జట్టు ఆటగాళ్ళను చూసి కన్నడ అభిమానులు ఈసాలా కప్ నమ్దే అంటూ నినదించారు.

ఈ వేడుకలో జెర్సీ ఆవిష్కరించిన అనంతరం ప్రముఖ గాయకులు తమ ఆటపాటలతో అభిమానులను అలరించారు.. ముఖ్యంగా కన్నడ గాయకులు విజయ్ ప్రకాష్, బెన్నీ దయాల్ వంటి వారు కన్నడ పాటలు పాడి అభిమానులను అలరించారు. డానిష్ అనే కమెడియన్ తన స్కిట్స్ తో అభిమానుల్లో నవ్వులు పూయించారు. స్మృతి ఆధ్వర్యంలో మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ కప్పు గెలిచిన నేపథ్యంలో.. ఈసారి బెంగళూరు పురుషుల జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు పురుషుల జట్టు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా దక్కించుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. జట్టుపై అంచనాలు పెంచే విధంగా యాజమాన్యం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అన్ బాక్స్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక అటు ఆటగాళ్లతో పాటు, ఇటు అభిమానుల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular