IPL 2024 – RCB : ఐపీఎస్ – 2024లో ఆర్సీబీ జర్నీ ముగిసింది. టైటిల్ రేసులో నిరాశగా నిష్క్రమించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ.. ప్లేఆఫ్‌కు చేరుకున్న ఆర్సీబీ.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఆర్సీబీ ప్లేయర్ల గుండెలతోపాటు ఫ్యాన్స్ హార్ట్స్ కూడా బ్రేక్ అయ్యాయి. ప్లే ఆఫ్‌లో ఓడిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూం వాతావరణం చూస్తే ఫ్యాన్స్ గుండెలు తరుక్కుపోవడం ఖాయం. డ్రెస్సింగ్ రూం వీడియోలను ఆర్సీబీ యాజమాన్యం తన సోషల్ మీడియాలో గురువారం(మే 23న) షేర్ చేసింది.
టైటిల్ కొట్టాలన్న లక్ష్యంతో..
ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న లక్ష్యంతో ఆర్సీబీ ఐపీఎల్ సీజన్ 17 మొదలు పెట్టింది. సీజన్ ఫస్ట్ ఆఫ్‌లో దారుణ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచి వరుసగా ఏడా మ్యాచ్‌లో ఓడిపోయిన ఆర్సీబీ.. సెకండ్ ఆఫ్‌లో అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి ప్లేఆఫ్‌కు చేరుకుంది. కానీ కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో చేతులు ఎత్తేసింది. టార్గెట్ రీచ్ కాకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగింది.
డ్రెస్సింగ్ రూంలో ఇలా..
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో దృశ్యాలను చూస్తూ కళ్లు చెమర్చుతున్నాయి. ఆటగాళ్లు బాధతో ఉన్న సీన్స్ ఫ్యాన్స్ గుండెలు పగిలేలా చేస్తున్నాయి. మ్యాక్స్‌వెల్ అయితే ఏకంగా డ్రెస్సింగ్ రూం డోర్‌ను గట్టిగా చేయితో కొడుతూ లోపలికి వెళ్లాడు. కెప్టెన్ డుప్లెసిస్ ఈ టోర్నీలో తమ జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. కింగ్ కోహ్లీ, దినేష్ కార్తీక్ కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ వీడియోలో వరుస ఆరు విజయాల తర్వాత చేసుకున్న సంబరాలను కూడా టీ యాజమాన్యం ఈ వీడియోలో చూపించింది. 17 ఏళ్లుగా ఆర్సీబీకి సపోర్టు చేస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Unfortunately, sport is not a fairytale and our remarkable run in #IPL2024 came to an end. Virat Kohli, Faf du Plessis and Dinesh Karthik express their emotions and thank fans for their unwavering support. ❤️#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/FYygVD3UiC
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ipl 2024 rcb rcb dressing room scenes go viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com