MS Dhoni: ఈ జనరేషన్ లో ఉన్న కుర్రాళ్ళకి మ్యాచ్ అనగానే ధోని గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీమ్ దశ దిశను మార్చిన కెప్టెన్ గా ధోనిని మనం అభిమానిస్తు ఉంటాం. ఇక అలాగే ఐపీఎల్ లో ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి టైటిల్ ని అందించిన కెప్టెన్ గా కూడా తను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తన చివరి ఐపిఎల్ సీజన్ ఆడుతున్న ధోని మీదనే అందరి ఫోకస్ ఉంది. ఇక తను అందుకు తగ్గట్టుగానే మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ కి వచ్చి రెండు మూడు బంతులను ఆడి మూడు సిక్స్ లు కొట్టి స్కోర్ పెంచడమే కాకుండా తన అభిమానులను కూడా అలరిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే నార్మల్ గా ధోనీకి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ… ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా కోపం ప్రదర్శించడు. ప్లేయర్లు సరిగ్గా ఆడకపోతే వాళ్ళకి సలహాలు ఇస్తాడే తప్ప ఆయన ఎవరు తప్పు చేసిన ఎప్పుడు కోపానికి రాడు. కానీ అలాంటి ధోని ఒక విషయం లో మాత్రం కోపానికి వచ్చాడు. అది ఎప్పుడు అంటే లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లా మధ్య రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన చెన్నై టీమ్ మొదట బ్యాటింగ్ తీసుకుంది.
అయితే రహానే ఒక పరుగు చేసి అవుట్ అవ్వగా, మరొక ఒపెనర్ అయిన ఋతురాజ్ గైక్వాడ్ మాత్రం సెంచరీ చేసి టీమ్ కి భారీ స్కోరుని అందించాడు. ఇక ఈ క్రమంలోనే శివం దూబే కూడా 66 పరుగులు చేసి టీమ్ భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇదిలా ఉంటే వాళ్ళు బాగా ఆడుతున్న క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ధోని వెంట్రుకలని సరి చేసుకుంటే ఒక కెమెరామెన్ తన కెమెరాతో ధోనిని క్యాప్చర్ చేశాడు. ఇక ఆ కెమెరామెన్ ను చూసిన ధోని వాళ్ళు గ్రౌండ్ లో అంత బాగా ఆడుతుంటే నువ్వు నా మీదకి కెమెరా ఫోకస్ చేస్తావ్ ఏంటి అన్నట్టుగా కోపంతో బాటిల్ తన మీదికి విసిరేయాలనేంత కోపానికి వచ్చాడు. అయితే ‘అందరి కోపములందు ధోని కోపం వేరయా’ అన్నట్టుగా ధోనీకి కోపం రావడం చాలా అరుదు.
అతను ఎవరి మీద కోపం చూపిస్తాడో వాళ్లు చాలా స్పెషల్ అనే చెప్పాలి అని మాజీ ప్లేయర్లు కూడా అంటూ ఉంటారు. ఇక ఈ మాట ను గుర్తు చేసుకున్న కెమెరామెన్ కూడా ధోని తన మీదకు కోపానికి వచ్చాడు అని బాధపడడం కంటే ధోని లాంటి ఒక గొప్ప క్రికెటర్ తన మీదకి కోపానికి వచ్చాడని సంతోషంగా ఫీల్ అవుతున్నాడు…ఇక మొత్తానికైతే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది…
Dhoni to Cameraman #MSDhoni #CSKvsLSG #IPL2024 #MSDhoni #ruturajgaikwad pic.twitter.com/ue2b1MxUgH
— Tanay (@tanay_chawda1) April 23, 2024