IPL 2024 MI vs GT : సుడిగాలి చుట్టూ ముట్టినట్టు.. తుఫాన్ ముంచెత్తినట్టు.. బడబాగ్ని దహించి వేసినట్టు.. ఆ బంతి అలా దూసుకొచ్చింది మరి.. చూస్తుండగానే వికెట్ ను నేలకూల్చింది. జరుగుతున్నది ఏంటో అర్థం కాక.. ఎలా స్పందించాలో తెలియక ఆ బ్యాటర్ అలా నిరాశగా పేవిలియన్ చేరుకున్నాడు. ఆ బౌలర్ మాత్రం విజయ గర్వంతో రెండు చేతులు పైకి లేపాడు. ఈ ఘటనకు ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికయింది.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడ్డాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు కెప్టెన్ గిల్(31; 22 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్) , వికెట్ కీపర్ వృద్ధి మాన్(19; 15 బంతుల్లో నాలుగు ఫోర్లు) సాహా 31 పరుగులు జోడించారు. ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ జస్ ప్రీత్ బుమ్రా కు బౌలింగ్ ఇచ్చాడు. తొలి 5 బంతులను వైవిధ్యంగా వేసిన బుమ్రా చివరి బంతిని యార్కర్ గా సంధించాడు. ఆ బంతిని తప్పుగా అంచనా వేసిన వృద్ధి మాన్ సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే.. బుమ్రా చేతిలో బలయ్యాడు. ఈ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్ నమోదు చేసింది.
వృద్ధిమాన్ అవుట్ అయిన తర్వాత గిల్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు పీయూష్ చావ్లా బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో గిల్ నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. కాగా, యార్కర్ తరహా బంతులు వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ ద్వారానే ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్ లో సత్తా చాటాడు. సిరీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సాహా వికెట్ తీయడం ద్వారా గుజరాత్ జట్టుకు హెచ్చరికలు పంపాడు. తన బౌలింగ్లో ఆడడం అంత ఈజీ కాదని అర్థమయ్యేలా చెప్పాడు.
Just Bumrah Things ♂️@Jaspritbumrah93 on target in his first over #GT reach 47/1 after 6 overs
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia
Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me
— IndianPremierLeague (@IPL) March 24, 2024