IPL 2024
IPL 2024.. ఐపీఎల్ 17వ సీజన్ కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా బెంగళూరు, డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా లీగ్ యుద్ధానికి రంగం సిద్ధం కానుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేవలం 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఈ 17 రోజుల్లో 21 మ్యాచ్ లు నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో ఏ రోజు, ఏ వేదికగా, ఏ జట్టు ఆడుతుందో.. ఈ వివరాలపై ప్రత్యేక కథనం.
మార్చి 22న ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండవ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు పంజాబ్ లోని మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతుంది..
మార్చి 23, శనివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మూడవ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది
నాలుగవ మ్యాచ్ మార్చి 24 ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్ల మధ్య జై పూర్ వేదికగా జరుగుతుంది.
మార్చి 24 ఆదివారం ఏడు గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా ఐదవ మ్యాచ్ జరుగుతుంది.
మార్చి 25 సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఆరవ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుంది.
ఏడవ మ్యాచ్ మార్చి 26 సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నై వేదికగా జరుగుతుంది.
మార్చి 27న హైదరాబాద్, ముంబై జట్ల మధ్య సాయంత్రం 7:30 నిమిషాలకు ఎనిమిదవ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
28 మార్చిన 9వ మ్యాచ్ రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య జైపూర్ వేదికగా జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
మార్చి 29న పదో మ్యాచ్ బెంగళూరు, కోల్ కతా మధ్య బెంగళూరు వేదికగా జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
మార్చి 30న 11వ మ్యాచ్ లక్నో, పంజాబ్ జట్ల మధ్య సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
మార్చి 31న గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య 12వ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం మూడు గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
31 మార్చిన 13వ మ్యాచ్ ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య జరుగుతుంది. విశాఖపట్నం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 1న 14వ మ్యాచ్ మొదలవుతుంది. ముంబై, రాజస్థాన్ జట్లు తలపడతాయి. ముంబై వేదికగా సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 2న 15వ మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరు, లక్నో జట్లు తలపడతాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
ఏప్రిల్ 3న 16వ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ, కోల్ కతా జట్లు తలపడతాయి. విశాఖపట్నం వేదికగా సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
ఏప్రిల్ 4న 17వ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గుజరాత్, పంజాబ్ జట్లు తలపడతాయి. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది.
ఏప్రిల్ 5న 18వ మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్, చెన్నై జట్లు తలపడతాయి. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 6 న 19వ మ్యాచ్ నిర్వహిస్తారు. రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడతాయి. జైపూర్ వేదికగా సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఏప్రిల్ 7న 20 వ మ్యాచ్ నిర్వహిస్తారు. ముంబై, ఢిల్లీ జట్లు తలపడతాయి. మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది.
ఏప్రిల్ 7న 21వ మ్యాచ్ నిర్వహిస్తారు. లక్నో, గుజరాత్ జట్లు లక్నో వేదికగా తలపడతాయి. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.
హైదరాబాద్
మర్ క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అనమోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఇమ్రాన్ మాలిక్, ఫజ్హక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కామిన్స్, హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రహ్మణ్యన్.
ముంబై ఇండియన్స్
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, బుమ్రా, బ్రెవిస్, డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, ములానీ, నెహల్ వదెరా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్, రోమారియో, జేసన్, గిరాల్డ్, మధుశంక, శ్రేయస్ గోపాల్, తుషార, కాంబోజ్, నబి, శివాలిక్ శర్మ.
బెంగళూరు
డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, రజత్ పాటిదార్, అనురావత్, గ్రీన్, విల్ జాక్స్, ప్రభుదేశాయి, లామ్రార్, కరణ్ శర్మ, టోప్లే, మనోజ్, మయాంక్ ధాగర్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, జోసెఫ్, యష్ దయాళ్, టామ్ కరన్, ఫెర్గ్యూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చుహాన్.
చెన్నై
మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, కాన్వే, రుట్ రాజ్, దూబే, దీపక్, మిచెల్ శాంట్నర్, రహానే, ముఖేష్ చౌదరి, పతిరన, తీక్షణ, తుషార్ దేశ్ పాండే, అజయ్ మండల్, రషీద్, రాజ్ వర్ధన్, సమర్ జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వి, ముస్తాఫిజూర్, అవనిష్ రావు.
గుజరాత్
గిల్, వేడ్, సాహా, విలియంసన్, మిల్లర్, మింజ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, విజయ శంకర్, సాయి సుదర్శన్, నల్కండే, జయంతి యాదవ్, ఓమర్ జాయ్, షారుఖ్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, జోషువా లిటిల్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మనవ్, జాన్సన్..
కోల్ కతా
అయ్యర్, జేసన్ రాయ్, గుర్భాజ్, అంగ్ క్రిష్, భరత్, మనిషి పాండే రూథర్ ఫర్డ్, వెంకటేష్ అయ్యర్, రసల్, అనుకూల్ రాయ్, నితీష్, సునీల్ నరైన్, రమణ్ దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాస్ శర్మ, చేతన్ సకారియా, స్టార్క్, రెహ్మాన్, అట్ కిన్సన్, హుసేన్.
రాజస్థాన్
సంజు, బట్లర్, జురెల్, ఫెరీరా, కునాల్ సింగ్, హెట్మేయర్, జైస్వాల్, దూబే, క్యాడ్ మోర్, పావెల్, రవిచంద్రన్ అశ్విన్, పరాగ్, ముస్తక్, జంపా, ఆవేష్ ఖాన్, కులదీప్ సేన్, నవదీప్ సైని, ప్రసిద్దకృష్ణ, సందీప్ శర్మ, బౌల్ట్, యజువేంద్ర చాహల్, నండ్రీ బర్జర్.
ఢిల్లీ
పృథ్వీ షా, రిషబ్ పంత్, అభిషేక్, డేవిడ్ వార్నర్, కుమార్, భుయ్, స్వస్తిక్, షాయ్, స్టబ్స్, బ్రూక్, లలిత్ యాదవ్, మిచల్ మార్ష్, ప్రవీణ్ దుబే, విక్కీ, యష్ ధూల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, యంగిడి, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోకియా, ఈశాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కులదీప్ యాదవ్, రసిక్ ధార్, రిచర్డ్ సన్.
పంజాబ్
ధావన్, ప్రభు, శివమ్, అథర్వ, హర్ ప్రీత్ సింగ్, జితేష్ శర్మ, బెయిర్ స్టో, రిలీ రోసో, లివింగ్ స్టోన్, రిషి ధావన్, సామ్ కరన్, సికిందర్ రజా, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ వర్మ, విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనై త్యాగరాజన్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చౌహాన్, విద్వత్ కావేరప్ప, అర్షదీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, ప్రిన్స్ చౌదరి.
లక్నో
పూరన్, రాహుల్, డికాక్, దేవ దత్ పడికల్, టర్నర్, మన్కడ్, ఆయుష్, దీపక్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, హర్షిన్ కులకర్ణి, డేవిడ్ విల్లే, మహమ్మద్ హర్షద్ ఖాన్, మోసిన్ ఖాన్, నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్, యుద్వీర్ సింగ్, మార్క్ ఉడ్, మయాంక్ యాదవ్, శివం మావి, సిద్ధార్థ.
లీగ్ మ్యాచ్ లు జరిగే వేదికలివే..
చెన్నై, మొహాలి, కోల్ కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు వైజాగ్ సొంత మైదానంగా ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ipl 2024 ipl 10 teams venues schedule these are complete details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com