Homeక్రీడలుIPL 2023 Playoffs Scenario: సంక్లిష్టంగా ప్లే ఆఫ్స్.. ఏ జట్లకు ఛాన్స్..?

IPL 2023 Playoffs Scenario: సంక్లిష్టంగా ప్లే ఆఫ్స్.. ఏ జట్లకు ఛాన్స్..?

IPL 2023 Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఏడు జట్లు ప్లే ఆఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలకమైన పోరు శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవి అనే దానిపై ఒక స్పష్టతను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ రెండు జట్లలో ఓడిపోయే జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలుగుతుంది.

ఐపీఎల్ 16వ ఎడిషన్ లీగ్ దశ ముగింపుకు వస్తోంది. ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఇంకా ఆడాల్సి ఉంది. చివరి మ్యాచ్ ఆడితే లీగ్ దశ ముగుస్తుంది. ప్రస్తుతం గుజరాత్ మాత్రమే 13 మ్యాచ్ ల్లో 9 విజయాలు, నాలుగు ఓటములతో 18 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్తును కన్ఫార్మ్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ జట్లు జట్లు కూడా ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి.

గెలిస్తేనే నిలిచే అవకాశం..

ప్లే ఆఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగూరు, ముంబై జట్లు ఉన్నాయి. చెన్నై, లక్నో జట్లు ఏడు మ్యాచ్ ల్లో ఏడు మ్యాచ్ ల్లో విజయాలు, ఐదు మ్యాచ్ ల్లో అపజయాలతో 15 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో లక్నో, ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుకు రానున్న మ్యాచ్ ల్లో జరగాల్సిన మ్యాచ్ ల ఫలితాలను బట్టి ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు శుక్రవారం గెలిచిన జట్టుతో పాటు ఏడు విజయాలతో సమానంగా ఉంటాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కు వెళ్ళగా, నెట్ రన్ రేట్ ఆధారంగా మూడు జట్లు టాప్ ఫోర్ లోకి వెళ్తాయి. కాబట్టి శుక్రవారం జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

14 మ్యాచ్ ల్లో ఏడేసి విజయాలతో..

ప్రస్తుతం చెన్నై, లక్నో జట్టు 15 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఒక్కో మ్యాచ్ లో ఈ రెండు జట్లు గెలిస్తే మిగిలిన జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆప్ కు చేరుకుంటాయి. చివరి మ్యాచ్ లో ఓటమిపాలు అయితే మాత్రం ఈ రెండు జట్లు మిగిలిన జట్ల విజయాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉంటుంది. బెంగళూరు, ముంబై జట్టు కూడా మిగిలిన ఒక్క మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఓడిపోతే మాత్రం నెట్ అండ్ రేట్ ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టు లే ఆఫ్ కు వెళుతుంది.

అత్యంత ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేసు..

గడిచిన ఐపీఎల్ సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ప్లే ఆఫ్ రేసు సాగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ జట్టు మినహా దాదాపు అన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. దీంతో ఏ జట్టు లే ఆఫ్ కు వెళ్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

RELATED ARTICLES

Most Popular