IPL 2023 PBKS Vs LSG: ఆ రికార్డు జస్ట్ మిస్.. అంతలా రెచ్చిపోయిన లక్నో బ్యాటర్లు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు.

Written By: BS, Updated On : April 29, 2023 10:39 am
Follow us on

IPL 2023 PBKS Vs LSG: ఐపీఎల్ లో పరుగులు వరద పారుతోంది. ఒకటి.. రెండు మ్యాచ్ లు మినహా ఈ సీజన్లోని ప్రతి మ్యాచ్ లోను భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ అయితే ఒకరితో మరొకరు పోటీపడి మరి పరుగులు సాధించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ మరీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే లక్నో జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం.

ఈ సీజన్ లో రికార్డు స్కోర్ నమోదు..

తాజాగా లక్నో వారియర్స్ జట్టు చేసిన స్కోరు ఈ సీజన్లోనే అత్యధికం కావడం గమనార్హం. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయింది ఈ జట్టు. 2013 లో పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లులో 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు చేసి రికార్డు నెలకొల్పింది. పదేళ్లు గడిచిన ఇప్పటికీ ఐపీఎల్ లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో ఈ రికార్డు బద్దలు అవుతుందేమో అనిపించింది. అయితే చివర్లో పూరన్, స్టోయినీస్ లు అవుట్ కావడంతో ఆర్సీబీ రికార్డుకు లక్నో చేరువుగా వచ్చి ఆగిపోయింది. వీళ్ళిద్దరూ అవుట్ కాకుండా ఉండి ఉంటే ఆ రికార్డు బద్దలై ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. వెంట వెంటనే ఇద్దరు అవుట్ కావడంతో బెంగళూరు జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇప్పటికీ రికార్డుగానే కొనసాగుతోంది. తాజాగా చేసిన స్కోర్ తో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో లక్నో జట్టు రెండో స్థానంలో నిలిచినట్టు అయింది. మూడో స్థానంలో 248 పరుగులతో ఆర్సీబీ జట్టే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 246 పరుగులతో కొనసాగుతోంది.

ఈ సీజన్ లో అత్యధిక పరుగులు నమోదు..

ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేస్తున్న జట్లు ఎక్కువగానే ఉంటున్నాయి. కనీసం 180 నుంచి 200 పరుగులను ఈ సీజన్లో ప్రతి జట్టు చేసింది. బ్యాటర్లు విజృంభిస్తుండడంతో బౌలర్లు తేలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక బౌలర్లుగా పేరుగాంచిన వాళ్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటి వరకు 16వ సీజన్ లో సగం మ్యాచులు జరిగాయి. ఆశించిన స్థాయిలో అభిమానులకు వినోదం లభించింది. మిగిలిన మ్యాచ్ లు ఇదే విధంగా జరిగితే ఈ సీజన్ అద్భుతమైన విజయం సాధించినట్లుగా క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.