https://oktelugu.com/

IPL 2023 Final : ఐపీఎల్‌ ఫైనల్‌ ఫీవర్‌.. గెలపుపై ఎవరి ధీమా వారిది.. గెలుపు ఎవరిది?

ఆటగాళ్లు కూడా అందరూ తమ శక్తిమేరక ప్రదర్శన ఇస్తున్నారు. ఇక గుజరాత్‌ కెప్టెన్‌ పాండ్యా కూడా జట్టును అన్నీ తానై నడిపిస్తున్నారు. ఈ జట్టుకు శుభ్‌మన్‌గిల్‌ అదనపు ప్లస్‌గా ఉన్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 28, 2023 / 12:13 PM IST
    Follow us on

    IPL 2023 Final :  దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ ఫైనల్‌ ఫీవర్‌ మొదలైంది. ఆదివారం సాయంత్రం చెనై్న సూపర్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ పెరుగుతోంది. కొన్ని గంటల్లో ఫలితం తేలనుండగా.. గంట గంటకూ ఆయా జట్ల అభిమానుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. రెండు జట్ల అభిమానులు తమ జట్టే గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.
    రెండుగా విడిపోయిన అభిమానులు..
    ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. లీగ్‌ దశ వరకు క్రికెట్‌ అభిమానులు తమకు ఇష్టమైన జట్టుకు అభిమానులుగా ఉన్నారు. ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో ఇలా ఎవరి జట్టుకు వారు మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్‌ సందర్భంగా ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు రెండుగా విడిపోయారు. చెన్నై, గుజరాత్‌ జట్లుకు ఈ రెండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ఒక వర్గం చెన్సై ఐదోసారి గెలవాలని ఆకాంక్షిస్తుండగా గుజరాత్‌ టైటిల్‌ నిలబెట్టుకోవాలని గుజరాత్‌ అభిమానులు కోరుకుంటున్నారు.
    భారీగా ఏర్పాట్లు..
    అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు ఐపీఎల్‌–2023 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటీనటులు మరియు గాయకుల ప్రదర్శనలతో అభిమానులందరూ మర్చిపోలేని విధంగా చేశారు.
    జోరుగా బెట్టింగ్స్‌..
    ఇక ఐపీఎల్‌ ఫైనల్‌పై బెట్టింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నప్పటికీ, గుజరాత్‌కు హోమ్‌ గ్రౌండ్‌ కావడంతో ఆ జట్టుపైనే ఎక్కువ మంది పందెం కాస్తున్నారు. చెన్నై అభిమానులు కూడా ఐదోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా చెన్నై నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీగా పందెం కాస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు టీంలుపై కుమ్మరిస్తున్నారు. మరోవైపు మ్యాచ్‌ ప్రారంభమయ్యాక ఆటగాళ్లు, ఫోర్లు, సిక్స్‌లు, వికెట్‌పై కూడా పందెం కాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
    పటిష్టంగా ఇరు జట్లు..
    ఐపీఎల్‌ ఫైనల్‌లో తలపడనున్న చెనై్న, గుజరాత్‌ జట్లు రెండూ పటిష్టంగా ఉన్నాయి. సమ ఉజ్జీల మధ్య ఆదివారం సాయంత్రం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోతోంది. చెనై్న సారథి ధోనీ సమష్టిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఆటగాళ్లు కూడా అందరూ తమ శక్తిమేరక ప్రదర్శన ఇస్తున్నారు. ఇక గుజరాత్‌ కెప్టెన్‌ పాండ్యా కూడా జట్టును అన్నీ తానై నడిపిస్తున్నారు. ఈ జట్టుకు శుభ్‌మన్‌గిల్‌ అదనపు ప్లస్‌గా ఉన్నాడు.