Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్ కొనసాగించడం లేదు ఒకప్పుడు తన బ్యాట్ తో మ్యాజిక్ చేసిన అతడు ప్రస్తుతం తడబడుతున్నాడు. పరుగులు చేయడంలో వెనుకంజ వేస్తున్నాడు. ఫలితంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇండియాకు ఎన్నో విజయాలు అందించినా ప్రస్తుతం మాత్రం అతడి కెరీర్ ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇంకా ఆరేడేళ్లు తనదైన ముద్ర వేసి టీమిండియాకు సేవలందించాలని అనుకుంటున్నా అతడి అదృష్టం తలకిందులవుతోంది. దీంతో జట్టు నుంచి తప్పుకోవాలనే వాదనలు రావడం సహజమే.
ఈ నేపథ్యంలో విరాట్ భవితవ్యం డోలాయమానంలో పడుతోంది. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించినా ఇప్పుడు మాత్రం విశ్రాంతి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడు గతమెంతో వైభవం ప్రస్తుతం మాత్రం నైరాశ్యం. విరాట్ ఫర్ఫార్మెన్స్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ విరాట్ టీ20 నుంచి తప్పుకోవాలని సూచించాడు.
Also Read: Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ
ఏకధాటిగా ఆడితే ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. అందుకే ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేసినా ఇక అతడి భవిష్యత్ మాత్రం బాగా లేదని తెలుస్తోంది. ప్రతి ఆటగాడికి రిటైర్మెంట్ అనేది సహజమే. కానీ పరుగులు రాబట్టడంలో వెనుకబడినప్పుడు ఇక విశ్రాంతి కావాలనే అభిప్రాయం అందరిలో వస్తోంది. మెడలు పట్టి బయటకు వెళ్లగొట్టకముందే సర్దుకుంటే మంచిదనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
మరోవైపు బెంగుళూరు చీఫ్ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లి గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు కోహ్లి తప్పకుండా ఫామ్ లోకి వచ్చి ఇండియాకు మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి ఆటగాడికి ఓ కాలం విషమ పరీక్షగా ఉంటుంది. అది ప్రస్తుతం కోహ్లికి వచ్చింది. భవిష్యత్ లో టీమిండియాను అగ్రగామిగా ఉంచడంలో అతడు శక్తివంచన లేకుండా కృషి చేస్తాడని కితాబిచ్చాడు. దీంతో విరాట్ స్థితి ఏంటనే దానిపై ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం అతడు ఇక విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక సమయాల్లో టీమిండియాను ముందుండి గెలిపించిన సత్తా కోహ్లి సొంతం. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఇది అందరికి వర్తిస్తుంది. కోహ్లి ఎక్కువ స్కోరు చేయడంపై దృష్టి పెట్టి తనపై వస్తున్న విమర్శలకు తగిన సమాధానం చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.
Also Read:TRS Plenary: కేసీఆర్ సేఫ్ గేమ్… ప్రత్యర్థుల పేరెత్తని గులాబీ అధినేత