IPL 2022- RCB Playoffs: గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లి పై విమర్శలు వస్తున్నాయి. బ్యాట్ కు పని చెప్పడం లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు కోహ్లి ఆడుతున్నాడు. ఐపీఎల్ 15 సీజన్లలో బెంగుళూరుకు ఆడుతున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సీజన్ లో కూడా ఇప్పటివరకు కూడా బ్యాట్ కు పని చెప్పలేదు. కానీ గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ తన బ్యాట్ కు పని చెప్పాడు. దీంతో బెంగుళూరుకు విజయం సాధించిపెట్టాడు.
ఇంతకాలం ఆటలో మజా అనుభవించని కోహ్లి తన బ్యాట్ తో విమర్శకులకు సమాధానం చెప్పాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడి తానేమిటో నిరూపించుకున్నాడు. అంతే కాదు భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. కోహ్లి ఫామ్ లోకి రావడంతో అభిమానులు మురిసిపోయారు. 54 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సులు బాది తనకు సత్తా తగ్గలేదని చూపించాడు.
Also Read: NTR Prashanth neel: కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ 31వ సినిమా.. ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బాంబ్సే
ఐపీఎల్ లో కోహ్లి 45వ అర్థ సెంచరీ నమోదు చేయడంతో ఏడు వేల మైలు రాయి రికార్డు దాటాడు. టీ 20 ఫ్రాంచైజీలో ఏడు వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా విరాట్ రికార్డు సాధించాడు. బెంగుళూరు తరఫున ఆడుతున్న విరాట్ ఈ ఘనతను సాధించడం విశేషం. కోహ్లి ఐపీఎల్ సీజన్లతో పాటు చాంపియన్స్ లో బెంగుళూరు తరఫునే ఆడటం గమనార్హం.
బెంగుళూరు తరఫున ఆడే ఏబీ డివిలియర్స్ 4522 పరుగులు చేసి రెండో స్థానంలో క్రిస్ గేల్ 3420 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో బెంగుళూరు తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ ఓడితే ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. కానీ ఏది గెలుస్తుందే తెలియడం లేదు. ఇప్పటికైనా విరాట్ బ్యాట్ ఝుళింపించి పరుగులు చేరయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:NTR Remuneration- Assets: ఎన్టీఆర్ ప్రస్తుత రెమ్యునరేషన్ ఎంత? ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?