https://oktelugu.com/

IPL 2022: అట్టడుగున ఆ రెండు చాంపియ‌న్ టీమ్ లు.. ఒక్కటి ఓడినా ఇంటికే..

IPL 2022: ముంబై ఇండియ‌న్స్.. చెన్నై సూప‌ర్ కింగ్స్.. ఈ రెండు జ‌ట్లు ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్లు. ఈ జ‌ట్ల‌కు.. ప్లేయ‌ర్స్ కు ఉన్నంత అభిమానులు..క్రేజ్ మ‌రో జ‌ట్టుకు ఉండ‌ద‌నే చెప్పాలి. ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఛాంపియ‌న్ ట్రోపిని సొంతం చేసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోపి కైవ‌సం చేసుకుంది. అలాంటిది ఈ సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కూడా చేయ‌లేదంటే జ‌ట్టు ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 21, 2022 / 02:01 PM IST
    Follow us on

    IPL 2022: ముంబై ఇండియ‌న్స్.. చెన్నై సూప‌ర్ కింగ్స్.. ఈ రెండు జ‌ట్లు ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్లు. ఈ జ‌ట్ల‌కు.. ప్లేయ‌ర్స్ కు ఉన్నంత అభిమానులు..క్రేజ్ మ‌రో జ‌ట్టుకు ఉండ‌ద‌నే చెప్పాలి. ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఛాంపియ‌న్ ట్రోపిని సొంతం చేసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోపి కైవ‌సం చేసుకుంది. అలాంటిది ఈ సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కూడా చేయ‌లేదంటే జ‌ట్టు ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ అయితే ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి బోణి చేశాం అనిపించుకుంది. టాప్ లో ఉండాల్సిన టీమ్ లు పాయింట్ల ప‌ట్టిక‌లో కిందినుంచి ఫ‌స్ట్ మేమే అన్న‌ట్లు ఉన్నాయి. ఒక్క మ్యాచ్ గెలిచి ప్లేఆప్స్ పై ఆశ‌లు పెట్టుకుంది సీఎస్కే టీమ్. ఇక ముంబై అయితే ప‌దో స్థానంలో కొన‌సాగుతూ ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ప్లేఆప్స్ కు ట్రై చేయ‌డానికి సిద్దం అవుతోంది.

    IPL 2022

    చెన్నై టీమ్ లో ప్రస్తుతం శివమ్‌ దూబే, రాబిన్‌ ఉతప్ప మిన‌హా ఇత‌ర ప్లేయ‌ర్స్ పెద్ద‌గా రాణించ‌డంలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు అంతంత మాత్రంగానే ఉన్నారు. కెప్టెన్‌ జడేజా ఆకట్టుకోలేకపోతున్నాడు. ధోనీ తొలి మ్యాచ్‌లో మెరిసినా తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడ‌టం ల‌ద‌నే చెప్పాలి. బౌలింగ్‌లో బ్రావో, మహీష్‌ ఆకట్టుకుంటున్నారు.

    ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చెన్నై సూప‌ర్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్‌ అయినా చేరుతుందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. ఒక్కటే గెలిచింది. దీంతో ఈ సారి కూడా జ‌ట్లు ప్లే ఆప్స్ పై సందిగ్ద‌త నెల‌కొంది. ఒకే మ్యాచ్ గెలవడంతో కేవలం 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఆడాల్సిన 8 మ్యాచ్‌ల్లో ఏడు తప్పక గెలిసి తీరాలి.

    IPL 2022

    ఇక ముంబై ఇండియ‌న్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌నీసం ఒక్క మ్యాచ్ గెలిచిన పాపాన‌పోలేదు. రోహిత్ శ‌ర్మ ఇటు కెప్టెన్ గా అటు బ్యాటింగ్ లో దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఇక బౌలింగ్ తీరైతే ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ఇక ఈ రోజు (గురువారం) చెన్నైతో త‌ల‌ప‌డుతుండ‌గా ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ముంబైకి ప్లేఆప్స్ కు వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయిన‌ట్లేన‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక‌వేళ బోణీ చేసి ప్లేఆప్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంటుందా చూడాలి. చెన్నై ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆప్స్ రేసులో నిలుస్తుందోలేదో చూడాలి. ఈ మ్యాచ్ గెలుపు ఇరుజ‌ట్ల‌కు కీల‌క‌మ‌నే చెప్పాలి.

    Recommended Videos:

    Tags