https://oktelugu.com/

IPL 2022: మెగా వేలంలోకి ‘కీ’ ప్లేయర్స్.. వీరంతా ఒకే జట్టులో ఉంటేనా?

IPL 2022: త్వరలోనే ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి బరిలోకి రెండు కొత్త జట్లు రానుండటంతో ఆటగాళ్ల వేలంపాటలు షూరు కానున్నాయి. ఈనేపథ్యంలోనే కీలక ఆటగాళ్లను ఐపీఎల్ కు చెందిన ఎనిమిది ప్రాంచైజీ జట్లు తమ వద్ద అంటిపెట్టుకున్నాయి. ఆ జట్టు ప్రకటించగా మిగిలిన కీ ప్లేయర్స్ వేలపాటల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ సైతం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ త్వరలో ప్రారంభ కానున్న నేపథ్యంలో ఈనెలాఖరులో మెగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2021 / 03:16 PM IST
    Follow us on

    IPL 2022: త్వరలోనే ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి బరిలోకి రెండు కొత్త జట్లు రానుండటంతో ఆటగాళ్ల వేలంపాటలు షూరు కానున్నాయి. ఈనేపథ్యంలోనే కీలక ఆటగాళ్లను ఐపీఎల్ కు చెందిన ఎనిమిది ప్రాంచైజీ జట్లు తమ వద్ద అంటిపెట్టుకున్నాయి. ఆ జట్టు ప్రకటించగా మిగిలిన కీ ప్లేయర్స్ వేలపాటల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ సైతం ఏర్పాట్లను పూర్తి చేసింది.

    ఐపీఎల్ 2022 సీజన్ త్వరలో ప్రారంభ కానున్న నేపథ్యంలో ఈనెలాఖరులో మెగా వేలం ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే వేలంపాటలో పాల్గొనే 11మంది ప్లేయర్ పై క్రికెట్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. వీరంతా ఒకే జట్టుగా ఉంటే మాత్రం ఎదురు తిరుగుతుందనే కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలాంటిది ఊహల్లో మాత్రమే నిజం కానుండగా ఆ ప్లేయర్స్ ఎవరో ఓసారి చూద్దాం.. !

    సన్ రైజర్ జట్టుకు తొలి ట్రోఫిని అందించిన ఆటగాడు  డేవిడ్ వార్నర్. జట్టుకు సారథిగా ముందుండి నడిపించాడు. అయితే 2021 ఐపీఎల్ సీజన్ అతడికి అచ్చిరాలేదు. దీనికితోడు యాజమాన్యంతో గొడవల చోటుచేసుకోవడంతో ఆ జట్టు అతడిని వదిలించుకుంది. అయితే వార్నర్ మాత్రం టీ20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నిని నిలిచి సత్తా చాటాడు. దీంతో మెగా వేలంలో అతడికి మంచి ధర పలికే అవకాశం కన్పిస్తోంది.

    ఐపీఎల్ 2021లో కెఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ సారధిగా వ్యవహరించాడు. ఆ సీజన్లో 626 పరుగులు సాధించాడు. రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో ఏదో ఒక జట్టుకు రాహుల్ కెప్టెన్ అవుతాడని టాక్ విన్పిస్తోంది. యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ ను కోలకత్తా నైట్ రైడర్స్ అనుహ్యంగా వదిలించింది. అంచనాలకు మించి రాణిస్తున్న గిల్‌ను కేకేఆర్ మళ్లీ కొనుగోలు చేసే అవకాశం కన్పిస్తోంది.

    ఐపీఎల్ 2021 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఢిల్లీ జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు అతడిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఈ ఏడాది ఒంటిచేత్తో విజయాలు అందించిన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్‌ ఒకడు. ఇతడిని తిరిగి వేలంలో ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే జట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడిని ముంబై కొనుగోలు చేయడం అనుమానమే.

    టీ20లో బెస్ట్ బౌలర్ గా ఉన్న రషీద్ ఖాన్ ను హైదరాబాద్ జట్టు అనుహ్యంగా వదిలించుుకంది. ఈ ఆటగాడికి మెగా వేలంలో అధిక ధర పలికే అవకాశం కన్పిస్తోంది. జోఫ్రా ఆర్చర్‌కు వరల్డ్‌ క్లాస్ సీమర్ గా పేరుంది. అలాగే అత్యుత్తమ బౌలర్ల జాబితా కగిసో రబడా, దీపక్ చాహార్, యుజ్వేంద్ర చాహల్ రేసులో ఉన్నారు. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న ఈ ఆటగాళ్లకు మెగా వేలంలో భారీ ధరలు పలికే అవకాశం కన్పిస్తోంది.