IPL 2022 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో విజేత ఎవరనేది తెలయనుంది. మొదటి నుంచి ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచుల్లో అన్ని జట్లు తమ సత్తా చాటినా చివరకు ఫైనల్ కు మాత్రం రెండే జట్లు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచులో నెగ్గి టైటిల్ నెగ్గాలని బావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తుది పోరులో నిలిచాయి. దీంతో ఎవరు విజయం సాధిస్తారో తెలియడం లేదు. బలాబలాలు చూస్తే గుజరాత్ కే విజయావకాశాలున్నా చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
ఈ సీజన్ లో గుజరాత్, లక్నో రెండు జట్లు కొత్తగా అరంగేట్రం చేసి అదరగొట్టాయి. చివరి వరకు తమ సత్తా చాటుతూ ఆడిన ప్రతి మ్యాచులో ప్రదర్శన చూపినా ఫైనల్ వరకు చేరలేకపోయాయి. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం మంచి పోటీ ఇచ్చి ప్రత్యర్థి జట్టుల్లో దడ పుట్టించడం తెలిసిందే. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేకపోయింది. దీంతో విమర్శలు మూటగట్టుకున్నా తుది ఫలితంపై అందరికి ఆసక్తి ఏర్పడింది.
Also Read: Pawan Kalyan CM Candidate: సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్.. బీజేపీ రూట్ మ్యాప్ లో సంచలన విషయాలు
ఫైనల్ మ్యాచ్ లో నెగ్గి టైటిల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ సత్తా చాటి ఎదుటి జట్టును ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఏదో ఒక జట్టు విజయం సాధిస్తుంది. మరో జట్టు ఓటమి పాలవుతుంది. అందుకే కప్ గెలుచుకోవాలనే తపన రెండు జట్లతో కనిపిస్తోంది. అందుకే ఫైనల్ మ్యాచ్ ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాయి. ఎదుటి జట్లుపై పైచేయి సాధించాలని భావిస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ రెండు జట్లు విజయంపై కన్నేశాయి. తమ పట్టు నిరూపించుకుని విజయం సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. రెండు జట్లలో నలుగురు ప్లేయర్స్ జట్టును మలుపు తిప్పే వారు ఉండటంతో వారిపైనే ఆశలు పెట్టుకున్నాయి. విజయం ముంగిట నిలవాలని తాపత్రయపడుతున్నాయి. ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించాలనే ఉత్సాహంతో ప్రాక్టీసు చేస్తున్నాయి. మొత్తానికి నేడు జరిగే మ్యాచ్ తో కప్ ఎవరిదో తెలుస్తుంది. విజయం ఎవరి సొంతం అవుతుందో తేటతెల్లం కానుంది.
Also Read:Renu Desai Second Husband: ‘రేణు దేశాయ్’ రెండో భర్త ఎవరు ? ఎందుకు కనిపించడం లేదు ?