https://oktelugu.com/

IPL 2022: ఆర్సీబీ క‌ప్ కొట్టేదాకా నో మ్యారేజ్ అంటున్న పిల్ల‌.. ఈ జ‌న్మ‌లో కాదంటున్న‌ నెటిజ‌న్లు..

IPL 2022: ఈ సాల కప్ నమ్దే అనే డైలాగ్ విన్నప్పుడ‌ల్లా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రికీ ఆర్సీబీనే గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే ప్ర‌తి సీజ‌న్ ప్రారంభంలో ఆర్సీబీ ఆట‌గాళ్లు చెప్పే మాట ఇదే. కానీ వారు చెప్పిన ప్ర‌తిసారి ఓడిపోయి విమ‌ర్శ‌లు పాలు కావ‌డ‌మే మిగులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఫైన‌ల్‌కు వెళ్లిన ఆర్సీబీ ఒక్క‌సారి కూడా టైటిల్‌ను ముద్దాడ‌లేక‌పోయింది. ప్ర‌పంచ మేటి మ్యాట్స్ మెన్ అయిన కోహ్లీ, మ్యాక్స్ వెల్ లాంటి వారు ఉన్నా.. […]

Written By: Mallesh, Updated On : April 13, 2022 1:39 pm
Follow us on

IPL 2022: ఈ సాల కప్ నమ్దే అనే డైలాగ్ విన్నప్పుడ‌ల్లా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రికీ ఆర్సీబీనే గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే ప్ర‌తి సీజ‌న్ ప్రారంభంలో ఆర్సీబీ ఆట‌గాళ్లు చెప్పే మాట ఇదే. కానీ వారు చెప్పిన ప్ర‌తిసారి ఓడిపోయి విమ‌ర్శ‌లు పాలు కావ‌డ‌మే మిగులుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఫైన‌ల్‌కు వెళ్లిన ఆర్సీబీ ఒక్క‌సారి కూడా టైటిల్‌ను ముద్దాడ‌లేక‌పోయింది.

IPL 2022

IPL 2022

ప్ర‌పంచ మేటి మ్యాట్స్ మెన్ అయిన కోహ్లీ, మ్యాక్స్ వెల్ లాంటి వారు ఉన్నా.. ఆ జ‌ట్టుకు ట్రోఫీ అందించ‌లేక‌పోయారు. అయితే ఈ టీమ్ మాత్రం ఇప్ప‌టికీ ఐపీఎల్ లో బ‌ల‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతుంది. ఈ టీమ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ సీజ‌న్‌లో అంచ‌నాల‌ను త‌గ్గ‌ట్టే క‌ప్ కొట్టాల‌నే క‌సితోనే సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక నిన్న చెన్నై, ఆర్సీబీ మ‌ధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జ‌రిగింది. ఇందులో వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన చెన్నై ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌నే క‌సితో దుమ్ము లేపిది. మొద‌ట బ్యాటింగ్ చేసిన సూప‌ర్ కింగ్స్ 216 పరుగులు చేసింది. అయితే ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ చివరి వరకూ పోరాడింది. కానీ 193 పరుగులు చేసి ఓడిపోయింది. అంత ప‌రుగులు చేసిందంటే గెలుపు కోసం ఎంత‌లా క‌ష్ట‌ప‌డిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ రెండు ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

IPL 2022

RCB

ఇదిలా ఉండ‌గా.. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఓ ఫ్ల‌కార్డు క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. స్టేడియంలో ఓ అమ్మాయి ప‌ట్టుకున్న ఫ్ల‌కార్డులో.. ఆర్సీబీ క‌ప్ కొట్టే వ‌ర‌కు తాను పెండ్లి చేసుకోబోనంటూ అందులో ఉంది. ఇంకేముంది దాన్ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేశారు. దీనిపై చాలా మీమ్స్ వ‌స్తున్నాయి.

ఆర్సీబీ క‌ప్ కొట్టేదెన్న‌డు నువ్వు పెండ్లి చేసుకునేదెన్న‌డు అని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంద‌రేమో మీ త‌ల్లి దండ్రుల ప‌రిస్థితేంటో.. నీకు ఈ జ‌న్మ‌లో పెండ్లి అవుతుందా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అంటే ఆర్సీబీ ప్ర‌తి సీజ‌న్‌లో క‌ప్ కొడ‌తామ‌ని చెబుతూ.. ఓడిపోతూనే ఉంద‌ని.. కాబ‌ట్టి నీకు పెండ్లి కాదంటూ కామెంట్లు పెడుతున్నార‌న్న‌మాట‌. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Tags