MS Dhoni Sister Jayanti Gupta: ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహేంద్రసింగ్ ధోని తన అసాధారణ ఆటతీరుతో ఇండియన్ క్రికెట్ నే మార్చేశాడు. తన కూల్ కెప్టెన్సీలో ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందించాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్(ఐపీఎల్)లో ఏకంగా చైన్నై టీంను ఐదు సార్లు విజేతగా నిలిపాడు. ఇప్పటికీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఎక్కడో సాధారణ కుటుంబ నేపథ్యానికి చెందిన ఽధోని ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. నిద్రలేని రాత్రులు అనుభవించాడు. కన్నీళ్లను దిగమింగుకున్నాడు. తొలినాళ్లల్లో ధోనిని ఎవరు ప్రోత్సహించారు? అతడిలో ప్రతిభను ఎవరు గుర్తించారు?
జార్ఞండ్ రాష్ట్ర రాజధాని రాంచిలో 1981 జూలై నెలలో శిపాన్ సింగ్, దేవకీదేవి దంపతులకు చివరి సంతానంగా ధోని జన్మించాడు. ఽధోనికి అన్నయ్య నరేంద్రసింగ్ ధోని, జయంతిగుప్తా అనే అక్క ఉన్నారు. శిపాన్ సింగ్ ఓ చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. వచ్చే ఆ కొద్ది వేతనంతోనో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని ధోనికి ఉండేది. కానీ అతడి ఆర్థిక పరిస్థితి ఆ లక్ష్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉండేది. అయితే, టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినప్పటికీ ధోని మనసులో ఏదో వెలితి ఉండేది. తన కోరిక గురించి తండ్రికి చెబితే ఏమనుకుంటారో అనే భయంతో మిన్నకుండే వాడు.
అయితే ఈ దశంలో ధోనికి అతడి అక్క జయంతి గుప్తా అండగా నిలబడింది. తల్లిదండ్రులకు నచ్చచెప్పింది. అతడి కల గురించి అర్థమయ్యేలా చేసింది. ధోనికి ఎలాంటి సాయం కావాలన్నా ముందుండేది. దీంతో ధోని తను అనుకున్న రంగంలో ముందడగు వేశాడు. ఆటగాడిగా, నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. వెయ్యి కోట్లకు అధిపతిగా( ఓ నివేదిక ప్రకారం) రికార్డు సృష్టించాడు. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న క్రికెటర్‌గా వెలుగొందుతున్నాడు. ఇండియన్ క్రికెట్ టీంకు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఏటా 50 కోట్లు వెనకేస్తున్నాడు. ఇటీవలే సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థను ఏర్పాటు చేసి ‘ఎల్‌జీఎం’ అనే సినిమాను నిర్మించాడు. ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ ధోనికి తొలినాళ్లల్లో అండగా ఉన్న అతడి అక్క, అన్న పరిస్థితి ఎలా ఉందంటే..
ధోని అక్క జయంతి గుప్తా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. ఆమె రాంచిలోని పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తోంది. ధోనికి ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతమ్ గుప్తాను జయంతి పెళ్లి చేసుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో ఽధోనికి జయంతితో పాటు గౌతమ్ అండగా ఉన్నారు. ఇక ధోని బయోపిక్‌లోనూ జయంతి ప్రస్తావన ఉంది. అయితే ఽధోని అన్న గురించి లేకపోవడం మాత్రం విశేషం. ఆయన కూడా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారని జాతీయ మీడియా చెబుతోంది.