IND Vs SA: టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. సెమి ఫైనల్ మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. వరల్డ్ కప్ విజయానికి ఒక అడుగు దూరంలో ఉంది. మరికొద్ది గంటల్లో ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కనుక టీమిండియా గెలిస్తే దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుంది. అంతేకాదు టీమిండియాను ఊరిస్తున్న వరల్డ్ కప్ సొంతమవుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ దాకా రావడానికి టీమిండియా చాలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా క్రికెట్ ఆడే తొలి రోజుల్లో భారత జట్టు ప్లేయర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తొలి రోజుల్లో టీమ్ ఇండియా ప్లేయర్లు డార్మెటరీ ల్లోనే నిద్రపోయేవారు. 20 మంది ప్లేయర్లకు 4 టాయిలెట్లు మాత్రమే ఉండేది. ఈ ప్రకారం ఒక్కో టాయిలెట్ ఐదుగురు వినియోగించుకునేవారు. స్వదేశంలో జరిగే టోర్నీలలో ఆడేందుకు డబ్బులు కూడా ఉండేవి కాదు. క్రికెట్ కిట్లను షేర్ చేసుకునేవారు. రైళ్లల్లో జనరల్ బోగీలో ప్రయాణించేవారు. సరిగా 50 సంవత్సరాలు క్రితం టీమ్ ఇండియా ప్లేయర్లు ఇటువంటి కష్టాలు పడ్డారు.. అయితే నేటి కాలంలో భారత క్రికెట్ మేనేజ్మెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా పేరుపొందింది. భారత ప్లేయర్లకు విపరీతమైన అవకాశాలు లభిస్తున్నాయి. మ్యాచ్ ఫీజులను కూడా భారత్ క్రికెట్ మేనేజ్మెంట్ పురుష క్రికెటర్లతో సమానంగా మహిళ క్రికెటర్లకు ఇస్తోంది.
మహిళా క్రికెటర్లకు మొదట్లో తక్కువగానే ఫీజు ఇచ్చేవారు. పైగా మహిళ క్రికెట్ కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉండేది. గడిచిన ఐదు సంవత్సరాలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా బీసీసీఐ కూడా భారీగా ఎదిగింది. ఐసీసీ కూడా మహిళ క్రికెట్ కు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. ప్రస్తుత మహిళల వన్డే వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇది పురుషుల ప్రపంచ కప్ కంటే ఎక్కువ కావడం విశేషం. విజేతగా నిలిచే జట్టుకు 39.50 కోట్లు అందిస్తారు. రెండో స్థానంలో ఉన్న జట్టుకు 19.78 కోట్లు ఇస్తారు. మరోవైపు భారత జట్టు గెలిస్తే బీసీసీఐ 125 కోట్లు అందిస్తుంది. గతంలో మహిళ క్రికెటర్లకు అంతగా సంపాదన ఉండేది కాదు. పురుష క్రికెటర్లతో పోల్చి చూస్తే అవకాశాలు కూడా అంతగా వచ్చేవి కాదు. కొంతకాలంగా పరిస్థితి మారిపోవడంతో మహిళ క్రికెటర్లు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచులతో పాటు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలు ఉండడంతో మహిళ క్రికెటర్లు భారీగా సంపాదిస్తున్నారు.