Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆల్‌రౌండర్‌ స్థానం.. అదరగొడుతున్న తెలుగు కుర్రోడిని కాదని.....

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆల్‌రౌండర్‌ స్థానం.. అదరగొడుతున్న తెలుగు కుర్రోడిని కాదని.. ఫామ్‌లో లేని గుజరాతీకి ఛాన్స్‌

Champions Trophy 2025: వనే‍్డ ప్రపంచ కప్‌ టోర్నీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న మరో టోర్నీ ఐసీసీ ఛాంపియన్‌‍్స ట్రోఫీ(ICC Champions Trophy). టెస్టు మ్యాచ్‌ ఆడే జట్లు మాత్రమే ఛాంపియన్స్‌ ట్రోఫీలో తలపడతాయి. ఈమేరకు 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్‌‍్స ట్రోఫీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. రెండు గ్రూపుల్లో నాలుగు జట్లు ఎండగా, లీగ్‌ దశలో ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్‌ 2లో ఉన‍్న జట్లు సెమీ ఫైనల్‌లో తలపడతాయి. ఈ టోర్నీకి సంబంధించిన జట్లు ఎంపిక జనవరి 12 వరకు పూర్తి చేయాలని ఐసీసీ ఆదేశించింది. కానీ, బీసీసీఐ ప్రత్యేక అనుమతితో వారం ఆలస్యంగా తుది జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మంచి ఫామలో ఉన‍్న కుర్రాళ్లుకు స్థానం దక్కలేదు. టీ20 మ్యచ్‌లలో, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న క్రీడాకారులను సెలక్టర్లు అసలు పరిగణనలోకి తీసుకోలేదు. పాత చింతకాయ పచ్చడిలా ఫామ్‌లో లేని వెటరన్‌ ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

నితీశ్‌కు నిరాశ
ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి(Nitish Reddy)ని కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఆల్‌రౌండర్‌ విభాగంలో నితీశ్‌రెడ్డికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కాగా, సెలక్టర్లు ఫామ్‌లో ఉన్న నితీశ్‌ను కాదని, ఆల్‌రౌండర్‌(All Rounder) స్థానాన్ని ఫామ్‌లో లేని గుజరాత్‌కు చెందిన హార్ధిక్‌ పాండ్యాను ఎంపిక చేయడం క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపర్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ గడ్డపై మంచి ఆటతో ఆకట్టుకున్న నితీశ్‌ దుబాయ్‌(Dubai) పిచ్‌పై రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినా ఫామ్‌లో లేని హార్ధిక్‌వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఇక బ్యాట్స్‌మెన్‌ కోటాలో యశశ్వి, రిషబ్‌ పంత్‌ మినహా ఎవరూ ఫామ్‌లో లేరు. ఈ నేపథ్యంలో అయినా నితీశ్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు.

ఆస్ట్రేలియాలో ఇలా..
ఆస్ట్రేలియాలో నితీశ్‌రెడ్డి మెల్‌బోర్న్‌ మైదానంలో జరిగిన బాక్సింగ్‌ డే(Boxing Day) టెస్టులో సెంచరీ చేశాడు. మిగతా మ్యాచ్‌లలోనూ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. మీడియం పేసర్‌గా రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్‌పేరు మార్మోగింది. ఆసీస్‌ను సొంత గడ్డపైనే గడగడలాడించిన క్రికెటర్‌గా నిలిచాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కూడా అదరగొట్టాడు. భారత్‌ను ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కించడమే కాకుండా చరిత్ర సృష్టించాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version