Odi World Cup 2023: ఇండియన్ క్రికెట్ టీం ఇంత కసిగా తయారుకావడానికి కారణం ఏంటి..?

పురాణాల్లో వాలి ఎలాగైతే తన ప్రత్యర్థుల బలాన్ని సగం లాగేసుకున్నట్టు గా ఇండియా తో మ్యాచ్ అంటే చాలు అన్ని దేశాల టీమ్ లు కూడా భయం తోనే బరిలోకి దిగుతున్నాయి.

Written By: Gopi, Updated On : November 3, 2023 9:40 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ఇండియన్ టీం మునుపెన్నడు లేని విధంగా వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడుతూ అద్భుతమైన విజయాలను సాధిస్తుంది.ఇక అందులో భాగంగానే ఇండియన్ టీమ్ ఇంత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది ప్రపంచ దేశాలకు సైతం అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఇండియాతో మ్యాచ్ అంటే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఇండియా మీద గెలవడానికి 50 50 గా ఛాన్స్ ఉండేది. అయితే ఆ టీమ్ అయిన మ్యాచ్ గెలవచ్చు , లేకపోతే ఇండియన్ టీమ్ అయిన మ్యాచ్ గెలవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించేవారు కానీ ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ మారిపోయింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా, వాళ్ళు ఎంత బలమైన టీం అయిన, వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల క్రికెట్ టీమ్ లకి సాధ్యం కాకపోయినా కూడా ఇండియన్ టీమ్ వాళ్ళని ఢీ కొట్టి చూపిస్తుంది. ఇక ఏ టీమ్ అయిన ఒక్కసారి ఇండియా తో మ్యాచ్ ఆడిందంటే మాత్రం ఆ మ్యాచ్ మొత్తాన్ని ఇండియా వన్ సైడ్ చేసేస్తుంది….

పురాణాల్లో వాలి ఎలాగైతే తన ప్రత్యర్థుల బలాన్ని సగం లాగేసుకున్నట్టు గా ఇండియా తో మ్యాచ్ అంటే చాలు అన్ని దేశాల టీమ్ లు కూడా భయం తోనే బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లందరు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు అందరూ కూడా ఎవరికి వాళ్లు సపరేటుగా ఒంటరి పోరాటం చేసి అయిన సరే మ్యాచ్ ని గెలిపించేంత సత్తా ఉన్న ప్లేయర్లుగా తయారయ్యారు. అయితే ఇండియన్ టీమ్ ఇంత స్ట్రాంగ్ గా తయారవ్వడానికి కారణం ఏంటి ? 2005 సంవత్సర కాలం లో ఎక్కడో 5,6 పొజిషన్ లో కొనసాగే ఇండియన్ టీమ్ గత 15,16 సంవత్సరాలలో ఇంత స్ట్రాంగ్ గా ఎలా తయారయింది దీనికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

మొదట ఇండియన్ టీమ్ కి గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇండియన్ టీమ్ పరిస్థితి ఎలా ఉండేది అంటే మ్యాచ్ చివరి వరకు పోరాడి చివర్లో 2,3 రన్స్ తో ఓడిపోయే టీమ్ గా ఇండియన్ టీమ్ పేరు తెచ్చుకుంది.ఇక ఎప్పుడైతే ధోని కెప్టెన్ గా వచ్చాడో అప్పటి నుంచి టీం ని చాలా స్ట్రాంగ్ చేయడానికి కష్టపడుతూ వచ్చాడు. అందులో భాగంగానే ఫస్ట్ బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టి బ్యాట్స్ మెన్స్ స్ట్రాంగ్ గా ఉండే విధంగా టీంలో చాలా మార్పులు చేశాడు.అందులో భాగంగానే టాలెంట్ ఉన్న ప్లేయర్లని టీమ్ లోకి తీసుకోవడం వాళ్లలో ఉన్న ప్రతిభ ని వాళ్లకి తెలిసేలా చేసి వాళ్ళ చేత మ్యాచ్ లు ఆడించి టి 20 వరల్డ్ కప్ కానీ, వన్డే వరల్డ్ కప్ కానీ గెలిచి చూపించాడు. అయితే ఈ క్రమంలోనే ఇండియన్ టీం అంటే ఏంటి , అసలు ఇండియన్ క్రికెట్ టీమ్ పవర్ ఏంటి అనేది ప్రూవ్ చేసాడు…ఇక ఒకప్పుడు చివరిదాకా వచ్చి చాలా మ్యాచ్ లను ఓడిపోయే ఇండియన్ టీం ఇప్పుడు ఒక చిరుత పులి వేట లాగా ముందుకు కదులుతుంది…ఇండియన్ టీమ్ వేట ముందు ప్రపంచ దేశలు భయపడిపోతున్నాయి… ఎప్పుడు ఏ మ్యాచ్ గెలుస్తుందొ , ఎప్పుడు ఏ మ్యాచ్ ఓడిపోతుందొ అర్థం కాని పరిస్థితి నుంచి మ్యాచ్ పొజిషన్ ను బట్టి ,మ్యాచ్ ఆడే పిచ్ ని బట్టి, ఏ ప్లేయర్ తో ఆడించాలి అనే దాని మీద ఫోకస్ పెట్టీ ధోనీ మ్యాచ్ ఆడేవాడు ఇక ధోని హయం ముగిసిన తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో కూడా చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఐసీసీ నిర్వహించే ట్రోఫీ లు మాత్రం గెలవలేకపోయాడు.

ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఇండియన్ టీమ్ మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది…2023 స్టార్టింగ్ లో ప్లేయర్లు అందరూ గాయాల బారినపడి టీంకు దూరమయ్యారు ఇంకా ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీమ్ కొంతవరకు కష్టాల్లో పడింది అనే చెప్పాలి. కానీ అనుకోకుండా వరల్డ్ కప్ కి ముందే ప్లేయర్లు అందరూ రికవరీ కావడం ఇండియన్ టీం లోకి రావడం ఇండియన్ టీమ్ బలాన్ని మరింత రెట్టింపు చేసిందనే చెప్పాలి. వరల్డ్ కప్ కి ముందు ఆడిన ఏషియా కప్ లో కూడా ఇండియన్ టీమ్ అద్భుతమైన విజయాలు అందుకుంది. ఇక అందులో భాగంగానే ఏషియా కప్ కూడా గెలుచుకుంది.కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో మాత్రం ఇండియన్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు అటు బ్యాటింగ్ లో,ఇటు బౌలింగ్ లో ఇండియా తన సత్తా చాటుతుంది.ఇక ఇండియన్ టీమ్ లో ప్రతి ప్లేయర్ కి ఆల్టర్నేట్ గా మరో ప్లేయర్ ఉండటం తో ప్లేయర్ల మధ్య పోటీ అనేది విపరీతం గా పెరిగి పోయింది.దాంతో అవకాశం వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా ఆకాశమే హద్దు అనే రేంజ్ లో చెలరేగి పోయి అద్భుతంగా ఆడుతున్నారు. ఒకరకం గా చెప్పాలంటే డూ ఆర్ డై మ్యాచ్ ఆడినట్టు గా ఆడుతున్నారు…ఇక ఇండియన్ టీమ్ ఇలాంటి ప్లేయర్లని కాపాడుకుంటూ వెళ్లగలిగితే ఇంకో 10 సంవత్సరాల వరకు ఇండియన్ టీమ్ అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ టీమ్ గా కొనసాగుతుంది…ప్రస్తుతం ఇండియన్ టీమ్ కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఎంటి అంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఇండియన్ టీమ్ లో అద్భుతంగా ఆడే ప్లేయర్లు దొరికేసారు కాబట్టి ఇండియన్ టీమ్ కి ఉన్న మంచి అడ్వాంటేజ్ కూడా ఇదే అని చెప్పాలి…

అయితే ప్రస్తుతం టీమ్ ఇలా స్ట్రాంగ్ అయి అద్భుతాలు చేయడం వెనక చాలాలాంది కెప్టెన్లు ,కోచ్ లా ప్రభావం చాలా ఉంది. అంతే తప్ప ఇది ఒక్క ఓవర్ నైట్ లో స్ట్రాంగ్ గా తయారైన టీమ్ కాదు అందుకే ఇండియన్ టీమ్ గ్రౌండ్ లెవల్ నుంచి స్ట్రాంగ్ పిల్లర్ వేసుకుంటూ వచ్చింది ఇప్పుడు దాన్ని పెకిలించడం ఏ ఒక్క టీమ్ వాళ్ల కూడా కాదు అనేది మనం ఖచ్చితం చెప్పవచ్చు…మన ప్లేయర్ల కసి ఏ రేంజ్ లో ఉందో ఈ వరల్డ్ కప్ లో సాధించిన వరుస విజయాలను చూస్తే మిగితా జట్ల కి అర్ధం అవుతుంది…ఇక ఒక్క సౌతాఫ్రికా టీమ్ ని ఓడిస్తే స్ట్రాంగ్ టీమ్ లు గా చెప్పుకునే అన్ని టీమ్ లను ఓడించి ఇండియన్ టీమ్ ఒక హిస్టరీ ని క్రియేట్ చేస్తుంది…