Homeక్రీడలుఐపీఎల్‌ స్పెషల్... ఏ రికార్డు.. ఎవరిదో తెలుసా..

ఐపీఎల్‌ స్పెషల్… ఏ రికార్డు.. ఎవరిదో తెలుసా..


గత కొంతకాలంగా ఇండియా ప్రైమ్ టైమ్ను ఆక్రమించిన సినిమాలు, సీరయర్స్‌, న్యూస్‌కు బ్రేక్‌ పడినట్టే. రాబోయే 53 రోజులు.. ఫుల్ క్రికెట్ హంగామాతో టీ‘వీక్షకులు’ సేద తీరనున్నారు. ఈ రెండు నెలలు ఇండియాలో ఎక్కడ చూసినా ధోనీ, కోహ్లీ, రోహిత్ పేర్లే వినబడతాయి. రాహుల్, శ్రేయస్, పంత్ మధ్య పోటీ గురించే చర్చ జరగనుంది. నేటి నుంచే ఐపీఎల్‌ 13 వ సీజన్. 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో గత పన్నెండు సీజన్లలో నమోదైన రికార్డులు, గణాంకాలు, వాటిని ఎవరు నమోదు చేశారో చూద్దాం..

ఐపీఎల్‌ విజేతలు
2008 రాజస్తాన్ రాయల్స్
2009 డెక్కన్ చార్జర్స్
2010 చెన్నై సూపర్కింగ్స్
2011 చెన్నై సూపర్కింగ్స్
2012 కోల్కతా నైట్రైడర్స్
2013 ముంబై ఇండియన్స్
2014 కోల్కతా నైట్రైడర్స్
2015 ముంబై ఇండియన్స్
2016 సన్రైజర్స్ హైదరాబాద్
2017 ముంబై ఇండియన్స్
2018 చెన్నై సూపర్కింగ్స్
2019 ముంబై ఇండియన్స్

టాప్‌3 అత్యధిక టీమ్‌ స్కోర్లు

స్కోరు జట్టు ప్రత్యర్థి సీజన్
1 263/5 ఆర్సీబీ పుణె వారియర్స్ 2013
2 248/3 ఆర్సీబీ గుజరాత్ లయన్స్ 2016
3 246/5 సీఎస్కే రాజస్తాన్ రాయల్స్ 2010

టాప్‌ 3 అత్యల్ప స్కోర్లు
స్కోరు జట్టు ప్రత్యర్థి సీజన్
1 49 ఆర్సీబీ కోల్కతా 2017
2 58 రాజస్తాన్ ఆర్సీబీ 2009
3 66 ఢిల్లీ ముంబై 2017

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ 5412
సురేశ్ రైనా 5368
రోహిత్ శర్మ 4898

అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు
లసిత్ మలింగ 170
అమిత్ మిశ్రా 157
హర్భజన్సింగ్ చెన్నై 150

అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
క్రిస్ గేల్ 326
ఏబీ డివిలియర్స్ 212
ఎంఎస్ ధోనీ 212

అత్యధిక సెంచరీలు
క్రిస్ గేల్ 6
విరాట్ కోహ్లీ 5
డేవిడ్ వార్నర్ 4

1 ఐపీఎల్‌లో ఒకే జట్టు టైటిల్‌ డిఫెండింగ్‌ చేసుకుంది. అంటే వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ఆ జట్టు చెన్నై. 2010,2011లో విజేతగా నిలిచింది.

3– లీగ్‌లో అత్యధిక హ్యాట్రిక్స్‌. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ రికార్డు సాధించాడు.

4 ఐపీఎల్‌లో అత్యధికంగా నాలుగు టైటిల్స్‌ నెగ్గిన జట్టు ముంబై. 2013, 15, 17, 19 సీజన్లలో విజేతగా నిలిచింది. చెన్నై మూడు టైటిల్స్‌తో రెండో స్థానంలో ఉంది.

175 నాటౌట్
– ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.2013 సీజన్లో పుణె వారియర్స్పై క్రిస్ గేల్ చేశాడు.

30
– లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీకి అవసరమైన బంతులు. 2013లో పుణెపై క్రిస్‌ గేల్‌ 30 బాల్స్‌లోనే సెంచరీ చేసి ఈ రికార్డు నెలకొల్పాడు.

18
– ఐపీఎల్‌ హాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీకి అసరమైన బంతులు. 2018ల లోకేశ్‌ రాహుల్‌ ఢిల్లీపై 18 బాల్స్‌లోనే అర్ధశతకం చేశాడు.

44
– ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ చేశాడు.

524
– ఐపీఎల్లో ఓ ప్లేయర్లు అత్యధికంగా కొట్టిన బౌండ్రీలు (ఫోర్లు, సిక్సర్లు). ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది.

6/12
– ఐపీఎల్లో ఓ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. 2019 సీజన్లో ముంబై ఇండియన్స్ పేసర్ అల్జారీ జోసెఫ్ సన్రైజర్స్పై నమోదు చేశాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular