Richard Kettleborough: ఈనెల 19వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్యన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు తమ వ్యూహాలతో బరిలోకి దిగుతుంటే వీటిలో ఇక ఏ జట్టు విజయం సాధిస్తుంది అనే దాని మీదనే ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈసారి ఇండియా కనక కప్పు గెలిచినట్టయితే మూడోసారి వరల్డ్ కప్ అందుకున్న టీమ్ గా చరిత్రలో నిలుస్తుంది.ఇలా కాకుండా ఆస్ట్రేలియా కనక కప్పు గెలిచినట్లైతే ఆరోసారి కప్పు అందుకున్న ఏకైక టీం గా ఒక రికార్డుని క్రియేట్ చేస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రేలియన్ ప్లేయర్లను మన బౌలర్లు ఎలా కట్టడి చేస్తారు అనే దాని మీదనే ఈ మ్యాచ్ అనేది డిపెండ్ అయి ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఎక్స్ ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏం చేసి అయిన కూడా ఈసారి కప్పు గెలవడమే లక్ష్యంగా ఇండియన్ టీమ్ ముందుకు కదులుతుంది. ఆస్ట్రేలియా కూడా తమ తమ వ్యూహాలతో ఇండియాని ఎలా ఓడించాలి అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టుకొని మరి బరిలోకి దిగుతుంది.ఇక వాళ్ల మైనస్ పాయింట్లని ప్లస్ పాయింట్ లుగా మార్చుకుంటూ కొంతమంది ప్లేయర్లను కూడా ప్లేయింగ్ లెవెల్ లోకి ఆడ్ చేసుకుంటూ ఫామ్ లో లేని ప్లేయర్లను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్ళ విషయం పక్కన పెడితే ఇండియన్ టీం మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది.
అది ఏంటి అంటే ఇండియన్ టీం నాకౌట్ మ్యాచ్ ఆడిన ప్రతిసారి రిచర్డ్ కెటిల్ బరో అనే ఎంపైర్ ఏంపైరింగ్ చేయడం వల్ల ఇండియన్ టీం ఆ మ్యాచ్ ల్లో ఓడిపోతూ వస్తుంది. దాని వల్ల అందరిలో ఆయన ఎంపైర్ గా ఉంటే ఇండియన్ టీమ్ నాకౌట్ మ్యాచ్ గెలవడం లేదనే ఒక నమ్మకం అయితే క్రికెట్ అభిమానుల్లో ఉంది. ఇంతకుముందు ఆయన ఇండియన్ టీమ్ కి ఎంపైరింగ్ చేసిన ప్రతి ఇండియన్ నాకౌట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది. 2014 సంవత్సరంలో టి20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్ కి వచ్చి ఓడిపోయింది. అలాగే 2015 వ సంవత్సరంలో వరల్డ్ కప్ సెమీఫైనల్ లోకి వచ్చి ఓడిపోయింది, 2016 వ సంవత్సరంలో టి20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కి వచ్చి ఓడిపోయింది, ఇక 2017 వ సంవత్సరంలో ట్రోఫీ ఫైనల్ కు వచ్చి ఓడిపోయింది, అలాగే 2019 వ సంవత్సరంలో వరల్డ్ కప్ లోవచ్చి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి వెనుతిరగాల్సి వచ్చింది.
ఇలా ఈయన ఎంపైరింగ్ చేసినా ప్రతి నాకౌట్ మ్యాచ్ లో కూడా ఇండియన్ టీం పరాభవాన్ని ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ఫైనల్ కి కూడా అతను ఎంపైరింగ్ చేయబోతున్నాడు ఇక ఇది తెలిసిన ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆయనని ఎందుకు ఎంపైర్ గా తీసుకుంటున్నారు ఆయన ఎంపైర్ గా చేస్తే ఇండియన్ టీమ్ మ్యాచ్ ఓడిపోతుందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఆయన ఒక ఐరన్ లెగ్ అంటూ పలు రకాల కామెంట్లు కూడా చేయడం విశేషం… మరి ఇప్పుడు ఇండియన్ టీం ఫైనల్లో గెలిచి ఆయన మీద ఉన్న ఐరన్ లెగ్ అనే బ్రాండ్ ని తీసేస్తారా ? లేదా ఓడిపోయి ఐరన్ లెగ్ బ్రాండ్ ని కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…