Homeక్రీడలుIPL Auction 2023: ఇండియన్ క్రికెటర్లు ఇంత చీపా.. వేలంలో రూ.2 కోట్లు కూడా పలకరా!?

IPL Auction 2023: ఇండియన్ క్రికెటర్లు ఇంత చీపా.. వేలంలో రూ.2 కోట్లు కూడా పలకరా!?

IPL Auction 2023: ఐపీఎల్‌–2023 మినీ వేలం డిసెంబర్‌ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఈ ఆక్ష¯Œ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్‌ చేయడానికి గడువు నవంబర్‌ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 714 భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్, 20 మంది అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్‌ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.

IPL Auction 2023
IPL Auction 2023

ధర తగ్గించిన రహానే, ఇషాంత్‌ శర్మ
ఈ సారి మినీ వేలంలో 19 మంది టీమిండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్‌ అగర్వాల్, ఇషాంత్‌ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్‌ ఈ సారి తమ బేస్‌ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. గతేడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ.50 లక్షలకు తగ్గించాడు. అదే విధంగా ఇషాంత్‌ కూడా తన బేస్‌ ప్రైస్‌ను రూ.75 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

మయాంక్‌.. మరీ దారుణం
గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్‌ రాకతో కేఎల్‌.రాహుల్‌ తమ జట్టును వీడటంతో పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం రూ.14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్‌ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం.

IPL Auction 2023
IPL Auction 2023

బేస్‌ ప్రైస్‌ ఉన్న ఆటగాళ్లు వీరే..
నాథన్‌ కౌల్టర్‌–నైల్, కామెరాన్‌ గ్రీన్, ట్రావిస్‌ హెడ్, క్రిస్‌లిన్, టామ్‌ బాంటన్, సామ్‌ కర్రాన్, క్రిస్‌ జోర్డాన్, టైమల్‌ మిల్స్, జామీ ఓవర్‌టన్, క్రెయిగ్‌ ఓవర్‌టన్, ఆదిల్‌ రషీద్, ఫిల్‌ సాల్ట్, బెన్‌ స్టోక్స్, ఆడమ్‌ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్‌ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్‌ డెర్‌ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్‌ పూరన్, జాసన్‌ హోల్డర్‌ బేస్‌ ప్రైజ్‌ రూ.2 కోట్లు పలికే జాబితాలో ఉన్నారు.

రూ.1.5 కోట్ల ప్రైస్‌ ఉన్న ప్లేయర్స్‌
సీన్‌ అబోట్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్‌సన్, ఆడమ్‌ జంపా, షకీబ్‌ అల్‌ హసన్, హ్యారీ బ్రూక్, విల్‌ జాక్స్, డేవిడ్‌ మలన్, జాసన్‌ రాయ్, షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ రూ.1.5 కోట్ల ప్రైస్‌ ఉన్న ప్లేయర్స్‌ జాబితాలో ఉన్నారు.

రూ.కోటి ధర కలిగిన ఆటగాళ్లు
మయాంక్‌ అగర్వాల్, కేదార్‌ జాదవ్, మనీష్‌ పాండే, మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్, మోయిసెస్‌ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్‌ వుడ్, మైఖేల్‌ బ్రేస్‌వెల్, మార్క్‌ చాప్‌మన్, మార్టిన్‌ గప్టిల్, కైల్‌ జామీసన్, మాట్‌ హెన్రీ, డారిన్‌ మిచెల్, టామ్‌ లాథమ్, హెన్రిచ్‌ క్లాసెన్, తబ్రైజ్‌ షమ్సీ, కుశల్‌ పెరెరా, రోస్టన్‌ చేజ్, రఖీమ్‌ కార్న్‌వాల్, షాయ్‌ హోప్, అకేల్‌ హోస్సేన్, డేవిడ్‌ వైస్‌ కేవలం రూ.కోటి ధర పలికే జాబితాలో ఉన్నారు.

భారత క్రికెటర్లకు ఎందుకీ పరిస్థితి..
ఐపీఎల్‌ వేలంలో పాల్గొగనేందుకు రిజిస్టర్‌ చేసుకున్న భారత క్రికెటర్లలో చాలామంది తమ ధరను రూ.కోటి లోపే పరిమితం చేసుకున్నారు. టాలెంట్‌ ఉంటే ఎంత ధర అయినా చెల్లించేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ మన క్రికెటర్లకు వారి ఫెర్ఫార్మెన్స్‌పై వారికే నమ్మకం లేదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే సొంతంగా ధర తగ్గించుకున్నారని తెలుస్తోంది. మరికొందరు జాతీయ, రంజీ జట్లలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారికి సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో ఐపీఎల్‌లో అయినా సత్తా చాటాలనుకుంటున్నారు. ఇందుకు ధర తక్కువగా నమోదు చేసుకుంటే సెలక్ట్‌ అవుతామని భావిస్తున్నట్లు క్రికెట్‌ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular